News
News
X

Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా నాగార్జున 'ఘోస్ట్' - ఎందుకో వివరించిన నిర్మాత

Nagarjuna's The Ghost Hindi Release Date : హిందీలో రెండు రోజుల ఆలస్యంగా 'ది ఘోస్ట్' సినిమా విడుదల కానుంది. ఎందుకనేది నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ వివరించారు.  

FOLLOW US: 

కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్' (The Ghost). ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. విజయ దశమి కానుక (Dussehra 2022 Tollywood Special) గా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. అయితే... అక్టోబర్ 5న కాదు. రెండు రోజుల ఆలస్యంగా!

అక్టోబర్ 7న హిందీలో 'ది ఘోస్ట్' విడుదల!
Producer Sunil Narang On The Ghost Movie Hindi Release : నార్త్ ఇండియాలో 'ది ఘోస్ట్' హిందీ వెర్షన్ అక్టోబర్ 7న విడుదల కానుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ వెల్లడించారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిందీ రిలీజ్ ఉందా? లేదా? అని ఆయన్ను ప్రశ్నించగా... ''మా ప్లాన్‌లో లేదు. సెప్టెంబర్ 5 లేదా 6 తేదీల్లో డిసైడ్ చేశాం. తర్వాత కొంత క‌న్‌ఫ్యూజ‌న్‌ నెలకొంది. చేయాలా? వద్దా?' అని! ఆ తర్వాత మనీష్ ఫోన్ చేసి హిందీలో కూడా విడుదల చేద్దామని అడిగారు. మేం ఓకే అన్నాం. కొంచెం లేటుగా ప్లాన్ చేశారు. ముందు చేసి ఉంటే బావుండేది'' అని సమాధానం ఇచ్చారు. హిందీ నుంచి 'ఘోస్ట్' ట్రైలర్, సినిమాకు ఇటువంటి స్పందన వస్తుందని ముందుగా ఊహించలేదని ఆయన తెలిపారు.

సోమవారం 'ది ఘోస్ట్' సెన్సార్!
'ది ఘోస్ట్' సినిమా తెలుగు సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. హిందీ సెన్సార్ ఇంకా కాలేదు. ప్రజెంట్ డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. సోమవారం హిందీ వెర్షన్ సెన్సార్ కంప్లీట్ చేయనున్నారు.
 
'ది ఘోస్ట్' సినిమాను స్టార్ట్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అయితే... ట్రైలర్ విడుదలైన తర్వాత ఇతర భాషల నుంచి మంచి స్పందన లభించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్టైలిష్ టేకింగ్, క్లాస్‌లో మాస్ చూపిస్తూ నాగార్జున చేసిన ఫైట్స్ ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైన రెండు వారాలకు థియేటర్లలోకి 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చింది. అందులో నంది అస్త్రంగా నాగార్జున పాత్ర వీరోచితంగా ఉంది. ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దాంతో సినిమాను హిందీలో విడుదల చేయాలని నిర్ణయించారు.

Also Read : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్

News Reels

'ది ఘోస్ట్' సినిమాలో నాగార్జునకు జంటగా ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) నటించారు. వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ 'వేగం...'ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. భరత్, సౌరబ్ ద్వయం ఆ పాటకు సంగీతం అందించగా... కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు.

సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అక్టోబర్ 5న విడుదల చేస్తారా? లేదంటే... కొంచెం ఆగుతారా? అనేది చూడాలి. మ్యాగ్జిమమ్ ఒకే రోజు దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Also Read : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ

Published at : 01 Oct 2022 06:31 PM (IST) Tags: Sonal Chauhan Praveen Sattaru The Ghost Movie Nagarjuna The Ghost Hindi Release The Ghost Hindi Release On Oct 8th

సంబంధిత కథనాలు

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Karthika Deepam November 28th: విషమంగా దీప ఆరోగ్యం- నిజం తెలిసి మోనితని బురిడీ కొట్టించిన శివ

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి