![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sudheer Babu's Hunt Teaser : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ
'హంట్' టీజర్‌ను సెప్టెంబర్ 28న విడుదల చేయాలనుకున్నారు. అయితే... సుధీర్ బాబు అత్తగారు, మహేష్ తల్లి మరణించడంతో ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ టీజర్ రిలీజ్ కొత్త డేట్ అనౌన్స్ చేశారు.
![Sudheer Babu's Hunt Teaser : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ Sudheer Babu's Hunt Teaser New Release Date Is Here Hunt Teaser On October 3rd Dussehra 2022 Tollywood Special Sudheer Babu's Hunt Teaser : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/01/4d2f24dc1e6b481ccce3156e8437c7eb1664626688212313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న హాయ్ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్' (Hunt Movie). భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఆ రోజు సుధీర్ బాబు అత్తగారు, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో టీజర్ లాంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ టీజర్ రిలీజ్ కొత్త డేట్ అనౌన్స్ చేశారు.
అక్టోబర్ 3న టీజర్...
అక్టోబర్ 3న ఉదయం 11.06 గంటలకు 'హంట్' టీజర్ (Hunt Movie Teaser) విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నుదుట గాయం, కారుతున్న రక్తంతో హీరో సుధీర్ బాబు కనిపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా టీజర్ ఉంటుందని, సుధీర్ బాబు పెర్ఫార్మన్స్ అండ్ స్టైల్ సూపర్ ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'హంట్'లో పోలీస్ అధికారిగా సుధీర్ బాబు!
'హంట్' విషయానికి వస్తే... సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ (Sudheer Babu As Cop In Hunt Movie) చేశారు. ఆయనతో పాటు శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ ముగ్గురి క్యారెక్టర్ పోస్టర్లు విడుదల చేశారు.
View this post on Instagram
అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. ఒక చేతిలో సిగరెట్, మరో చేతికి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్, ఒంటిపై స్టైలిష్ కోట్, అన్నిటికీ మించి కళ్లలో ఇంటెన్స్ లుక్... సుధీర్ బాబు న్యూ లుక్ బావుంది. మోహన్ భార్గవ్ పాత్రలో శ్రీకాంత్, దేవ్‌గా 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
సినిమా గురించి వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ " ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్... సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపిస్తారు. కనిపించని శత్రువును పట్టుకోవడం కోసం ఎటువంటి వేట సాగించారన్నది చిత్రకథ. యాక్షన్ సీక్వెన్సులు నేచురాలిటీకి దగ్గరగా ఉంటాయి'' అని చెప్పారు.
Also Read : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్
సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ సినిమాలో 'మైమ్' గోపి, 'జిల్' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి కళ : వివేక్ అన్నామలై, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)