అన్వేషించండి

Rangabali Movie: ఒత్తిడికి లొంగని ‘రంగబలి’ మూవీ టీమ్ - ఆ జర్నలిస్టుల స్పూఫ్ వీడియో రిలీజ్!

‘రంగబలి’ మూవీ టీమ్ హీరో నాగశౌర్య, కమెడియన్ సత్య కలసి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. కానీ ఆ ఇంటర్వ్యూను నిలిపివేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఒత్తిడికి లొంగకుండా ఆ ఇంటర్య్వూ రిలీజ్ చేశారు మేకర్స్.

Rangabali Movie: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా సక్సెస్ అవుతుందో చెప్పలేం. ఓక్కోసారి కొన్ని సినిమాల్లో కంటెంట్ ఉన్నా అవి సరైన ప్రచారం చేయకపోవడంతో ప్రేక్షకాదరణ పొందలేకపోతాయి. అందుకే ఈరోజుల్లో ప్రతీ మూవీ మేకర్స్ తాము తీసిన సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రమోషన్స్ ను చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ ను చాలా వెరైటీగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు మేకర్స్. రీసెంట్ గా నాగశౌర్య హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాకు కూడా అలాంటి వినూత్న ప్రచార కార్యక్రమాలను చేశారు మూవీ టీమ్. అందులో భాగంగానే కమెడియన్ సత్యతో కలసి ఓ ఇంటర్వ్యూ చేశారు హీరో నాగశౌర్య. ఆ ఇంటర్వ్యూలో కొంత మంది ప్రముఖ జర్నలిస్ట్ లను ఇమిటేట్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ మొదటి పార్ట్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఎట్టకేలకు ఇంటర్వ్యూను రిలీజ్ చేసిన ‘రంగబలి’ టీమ్..

‘రంగబలి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ వినూత్న ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది మూవీ టీమ్. కమెడియన్ సత్యతో కలసి హీరో నాగశౌర్య చేసిన ఆ వివాదాస్పద ఇంటర్వ్యూ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇందులో కమెడియన్ సత్య నాగశౌర్యను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. ఓ ప్రముఖ చానల్ వచ్చే కార్యక్రమాన్ని ‘ఓపెన్ హార్ట్ విత్ సత్య’ పేరుతో ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హీరో నాగశౌర్య ను పలు విచిత్ర ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేశారు సత్య. ఈ ప్రశ్నలన్నీ కాంట్రవర్సీగా ఉంటూనే ఫన్ ను క్రియేట్ చేశాయి. అలాగే తర్వాత ‘ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ’ పేరుతో మరో జర్నలిస్ట్ లా గెటెప్ వేసుకొని నాగశౌర్యను ఇంటర్య్వూ చేశారు సత్య. ఇది కూడా చాలా సెటైరికల్ గా ఫన్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సెకండ్ పార్ట్ ను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. 

ఒత్తిడికి లొంగకుండా.. ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గకుండా..

‘రంగబలి’ మూవీ టీమ్ ప్రమోషన్స్ పై చాలా ఇంట్రస్టింగ్ గా వర్క్ చేస్తుంది. మూవీ ప్రమోషన్స్ టీమ్ ఎక్కడా తగ్గడం లేదు. అందుకే ఈ మూవీ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడం అలాగే ప్రమోషన్స్ వీడియోలు బాగా వైరల్ అవడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ సత్య వివిధ గెటప్ లలో చేసిన ఇంటర్వ్యూ మాత్రం వివాదాస్పదంగా మారింది. ఇందులో ప్రముఖ జర్నలిస్ట్ లను కించపరిచేలా చేశారని, ఆ ఇంటర్వ్యూను నిలిపి వేయాలని మూవీ టీమ్ పై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో ఈ ఇంటర్య్వూను నిలిపేస్తారని అనుకున్నారంతా. అయితే ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా ఆ ఇంటర్వ్యూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పాటల రచయిత అనంత శ్రీరామ్ తో ఇలాగే ఓ వైరల్ వీడియో ప్లాన్ చేశారు. అయితే అది అంతగా ప్రభావం చూపలేదు. కానీ సత్య ఇంటర్వ్యూ మాత్రం మూవీ పై ఫుల్ హైప్ తీసుకొచ్చింది. మరి తెరపై మూవీలో ఎలాంటి కామెడీ ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తుండగా యుక్తి తరేజా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: టిఫెన్ కొట్టుకి నిప్పు పెట్టిన శకుంతల.. మంటల్లో చిక్కుకున్న లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: టిఫెన్ కొట్టుకి నిప్పు పెట్టిన శకుంతల.. మంటల్లో చిక్కుకున్న లక్ష్మీ!
Vaazha 2 OTT : రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మలయాళ బ్లాక్ బస్టర్ - 200 కోట్ల మూవీ ఎందులో చూడొచ్చంటే?
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DMK Complaint Against CM Vijay 2026: కొత్త వివాదంలో సీఎం విజయ్! అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాలని డీజీపీకి డీఎంకే ఫిర్యాదు!
కొత్త వివాదంలో సీఎం విజయ్! అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాలని డీజీపీకి డీఎంకే ఫిర్యాదు!
YS Jagan Mavigun vs Amaravati : ‘మావిగన్ వర్సెస్ అమరావతి’గా వచ్చే ఎన్నికల సమరం - వైఎస్ జగన్ సంచలన ప్రకటన
‘మావిగన్ వర్సెస్ అమరావతి’గా వచ్చే ఎన్నికల సమరం - వైఎస్ జగన్ సంచలన ప్రకటన
Petrol Diesel Price Down India: లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
Car Price Hike: వాహనదారులకు షాక్.. కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్, కియా ఇండియా, ఎంజీ మోటార్స్
వాహనదారులకు షాక్.. కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్, కియా ఇండియా, ఎంజీ మోటార్స్
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
Indian Influencer Family: టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్
టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్
Embed widget