Krishna Vrinda Vihari: 'కృష్ణ వ్రింద విహారి' కొత్త రిలీజ్ డేట్ ఇదే!
నాగశౌర్య నటిస్తోన్న 'కృష్ణ వ్రింద విహారి' సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

యంగ్ హీరో నాగశౌర్య డిఫరెంట్ జోనర్స్ లో కథలను ఎన్నుకుంటూ నటుడిగా తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో అతడు సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు. రీసెంట్ గా విడుదలైన 'లక్ష్య' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
అందులో ఒకటి తన సొంత బ్యానర్ లో చేస్తున్నాడు. అనీష్ ఆర్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ సందడి చేశాయి. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసుకున్నారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 20న విడుదల సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో షిర్లీ సేతియా హీరోయిన్ గా కనిపించనుంది. నటి రాధిక కీలకపాత్ర పోషిస్తుంది. అలానే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ లాంటి నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఉష ముల్పూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మహతి స్వాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















