News
News
X

Naga Chaitanya Custody Update : శంకర్ రేంజ్‌లో నాగ చైతన్య 'కస్టడీ'లో సాంగ్ షూట్ - ఎక్కడంటే?

సాంగ్స్ తీయడంలో తమిళ దర్శకుడు శంకర్ శైలి గురించి తెలిసిందే. భారీ ఎత్తున తీస్తారు. ఆయనకు ఏమాత్రం తీసిపోని రీతిలో నాగచైతన్య 'కస్టడీ'లో సాంగ్ ప్లాన్ చేశారు దర్శకుడు వెంకట్ ప్రభు.

FOLLOW US: 
Share:

సాంగ్స్ తీయడంలో లెజెండరీ ఫిల్మ్ మేకర్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ శైలి గురించి తెలిసిందే. పాటల్లో భారీతనం కనబడుతుంది. అయితే, ఎవరూ చూడని కొత్త లొకేషన్స్ ప్రేక్షకులకు చూపిస్తారు. లేదంటే భారీ సెట్స్ వేస్తారు. ఆయనకు ఏమాత్రం తీసిపోని రీతిలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య  (Akkineni Naga Chaitanya) 'కస్టడీ'లో సాంగ్ దర్శకుడు వెంకట్ ప్రభు ప్లాన్ చేశారు.

నాగ చైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా 'కస్టడీ' (Custody Movie). తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. చైతన్యకు తొలి స్ట్రయిట్ తమిళ చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమాలో సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. 

ఒక్క పాటకు ఏడు సెట్స్!
'కస్టడీ'లో సాంగ్ షూటింగ్ కోసం వెంకట్ ప్రభు ఏడు సెట్స్ వేయించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో పాటకు అన్ని సెట్స్ వేయించడం అరుదు. నాగ చైతన్య, కృతి శెట్టిపై ఆ సాంగ్ తెరకెక్కిస్తున్నారని తెలిసింది.  ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ బ్లాక్ బస్టర్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు.

Also Read : లావణ్యా త్రిపాఠి 'పులి - మేక'కు రామ్ చరణ్ సాయం... అదేంటో తెలుసా?

నాగ చైతన్య ఇంతకు ముందు కొన్ని మాస్ సినిమాలు చేశారు. అయితే, 'కస్టడీ'లో మాత్రం ఆయన యాక్షన్ కొత్తగా ఉండబోతుందని గ్లింప్స్‌ చూస్తే అర్థం అవుతోంది. ఈ వీడియో నిడివి పెద్దగా లేదు. జస్ట్ 26 సెకన్లు. అందులో విజువల్స్ నిడివి ఇంకా తక్కువ. అయితేనేం? సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోందనేది వెంకట్ ప్రభు చూపించారు. 

పల్లెటూరి మధ్యలో వెళుతున్న బొగ్గు రైలును ముందు చూపించారు. ఆ తర్వాత రోడ్డు మీద వెళుతున్న కార్లు (పోలీస్ కార్స్), ఆ తర్వాత జాతర సెటప్, ఆ వెంటనే బ్లాస్ట్... స్మోక్ ఎఫెక్ట్ మధ్యలో నుంచి నాగ చైతన్య ఎంట్రీ, రెండు మూడు యాక్షన్ కట్స్! మొత్తం మీద గ్లింప్స్‌ బావుంది. 

Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?   

'కస్టడీ'లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సినిమాలో ఆయన పేరు 'ఏ చైతన్య'. 'ఏ' అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే...  తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. 

మే 12న విడుదల!
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. మే 22న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : వెంకట్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్, యాక్షన్ : మహేష్ మాథ్యూ, కళా దర్శకత్వం : డివై సత్యనారాయణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వెంకట్ ప్రభు. 

Published at : 16 Feb 2023 12:24 PM (IST) Tags: Krithi Shetty Naga Chaitanya Venkat Prabhu Custody Movie Update

సంబంధిత కథనాలు

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?