News
News
X

Puli Meka Teaser : లావణ్యా త్రిపాఠి 'పులి - మేక'కు రామ్ చరణ్ సాయం

Zee5's Puli Meka teaser : హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'పులి - మేక'. దీని టీజర్ రామ్ చరణ్ విడుదల చేయనున్నారు. అది ఎప్పుడంటే?

FOLLOW US: 
Share:

సొట్టబుగ్గల సుందరి, డెహ్రాడూన్ భామ లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పులి - మేక' (Puli Meka Web Series). ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. 'అందాల రాక్షసి' ఖాకీ చొక్కా వేయడం ఇదే తొలిసారి. ఇందులో యువ హీరో ఆది సాయి కుమార్ సైతం ప్రధాన పాత్ర చేశారు.

రేపే 'పులి - మేక' టీజర్ విడుదల...
అదీ రామ్ చరణ్ చేతుల మీదుగా! 
'పులి - మేక' వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ (Puli Meka First Look) ను ఫిబ్రవరి 17న... అనగా శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సిరీస్ ఇది.

Also Read : సద్గురుకు ఉపాసన దత్త పుత్రిక - రామ్ చరణ్ వైఫ్ పోస్ట్ చూశారా?
 
View this post on Instagram
 
A post shared by ZEE5 Telugu (@zee5telugu)

ఫిబ్రవరి 24న 'పులి - మేక' విడుదల
Puli Meka Web Series Release Date : పోలీస్ శాఖ నేపథ్యంలో 'పులి - మేక' వెబ్ సిరీస్ రూపొందించారు. ఆల్రెడీ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఒకరి తర్వాత మరొకరు... పోలీస్ శాఖలో వ్యక్తులను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. అతడిని ఎలా పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇదొక సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పవచ్చు. 

Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే? 

పోలీస్ శాఖతో పాటు ఆస్ట్రాలజీతో మిళితమైన కథతో సిరీస్ తెరకెక్కించారని తెలిసింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'జీ 5' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. సిరీస్ మొత్తంలో ఎవరు పులి? ఎవరు మేక? అనేది ఆసక్తి రేపుతుందని, ప్రతి మలుపు ప్రేక్షకులను తర్వాత ఏం జరుగుతుంది? అని ఆసక్తి కలిగించేలా ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

గోపీచంద్ 'పంతం' తీసిన దర్శకుడే!
'పులి - మేక'కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పంతం' సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. చక్రవర్తి రెడ్డికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి జీ 5 ఓటీటీ ఈ సిరీస్ నిర్మించింది. త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఫస్ట్ లుక్ విడుదల రోజున మోషన్ పోస్టర్ లేదా చిన్న టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. 

సుమన్, 'బిగ్ బాస్' సిరి హనుమంతు, 'ముక్కు' అవినాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న 'పులి - మేక' వెబ్ సిరీస్‌కు ఛాయాగ్రహణం : సూర్య కళా, కూర్పు : చోటా కె. ప్రసాద్, కళా దర్శకత్వం : బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు, దర్శకత్వం : కె. చక్రవర్తి రెడ్డి.

Published at : 16 Feb 2023 11:56 AM (IST) Tags: Lavanya Tripathi aadi sai kumar Ram Charan Puli Meka Teaser

సంబంధిత కథనాలు

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?