Love Story : లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా రిలీజ్ చేస్తారా..?
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'లవ్ స్టోరీ'.
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'లవ్ స్టోరీ'. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శ్రీనారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్ లో విడుదల కావాలి. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది.
Also Read : Seetimaarr Movie Review : సీటీమార్ మూవీ రివ్యూ.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్..
ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఒకానొక దశలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు ఊపందుకున్నాయి. కానీ మేకర్స్ మాత్రం థియేటర్లలోనే సినిమా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న సినిమాను రిలీజ్ చేస్తామని మరోసారి ప్రకటించారు. కానీ ఈరోజు కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
కానీ ఈరోజు సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కొన్ని అనివార్యకారణాల వలన సినిమా రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఈ కథను చెప్పాలని చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నామని.. సెప్టెంబర్ 24న థియేటర్లో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారైనా సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి!
NAGA CHAITANYA - SAI PALLAVI: 'LOVE STORY' NEW RELEASE DATE... #Telugu film #LoveStory - starring #NagaChaitanya and #SaiPallavi - to release in *cinemas* on 24 Sept 2021... Directed by #SekharKammula... Produced by Narayan Das K Narang and Puskur Ram Mohan Rao. pic.twitter.com/C7UZ4p9dga
— taran adarsh (@taran_adarsh) September 10, 2021
Also Read : Thalaivii Review: ‘తలైవి’ రివ్యూ: కథ కాదిది జీవితం
Also Read : Tuck Jagadish Review: ‘టక్ జగదీష్’ రివ్యూ: మరీ ఇంత సీరియస్గా ఉంటే ఎలా నాని?
Also Read : Rajinikanth Annaatthe first look : పంచెకట్టుతో రజినీ.. లుక్ అదుర్స్ కదూ..
Also Read : Khiladi First Single Out : ఫ్యాన్స్ కు రవితేజ ట్రీట్.. 'ఖిలాడి' ఫస్ట్ సాంగ్ ఔట్..
Ram Charan Watch: రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ దొరికితే కోటీశ్వరులు కావచ్చు.. ధర ఎంతో తెలుసా?