Seetimaarr Movie Review : సీటీమార్ మూవీ రివ్యూ.. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్..
తెలుగులో 'రచ్చ', 'బెంగాల్ టైగర్' వంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది తాజాగా గోపీచంద్ హీరోగా 'సీటీమార్' అనే సినిమాను రూపొందించాడు.
సంపత్ నంది
గోపీచంద్, తమన్నా, భూమిక, రావు రమేష్ తదితరులు
తెలుగులో 'రచ్చ', 'బెంగాల్ టైగర్' వంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది తాజాగా గోపీచంద్ హీరోగా 'సీటీమార్' అనే సినిమాను రూపొందించాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో.. కమర్షియల్ గా ఎలాంటి హిట్ అందుకుందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..!
కథ :
కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్. తన ఊర్లో ఉన్న యుక్త వయసు అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తుంటాడు. వారందరినీ నేషనల్స్ కి తీసుకువెళ్లాలనేది కార్తీక్ కోరిక. దానికి ఓ కారణం ఉంది.అదేంటంటే.. తన ఊర్లోని స్కూల్ ని కాపాడుకోవాలి. అందుకే ఎంత కష్టమైనా.. ఊర్లో వారందరినీ ఒప్పించి.. మేనేజ్మెంట్ తో మాట్లాడి తన టీమ్ ను ఢిల్లీకి తీసుకెళ్తాడు. నేషనల్స్ లో ఆంధ్రా టీమ్ ఫైనల్స్ వరకు వెళ్తుంది. అయితే ఫైనల్స్ కి రెండు రోజుల ముందు టీమ్ మొత్తాన్ని ఓ లోకల్ రౌడీ కిడ్నాప్ చేస్తాడు. అతడి నుండి కార్తీక్ తన టీమ్ ను ఎలా కాపాడుకున్నాడు..? అసలు టీమ్ ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది..? ఆంధ్రా టీమ్ ఫైనల్స్ లో గెలిచిందా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ :
కబడ్డీ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటికంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ పక్కా కమర్షియల్ పాయింట్ తో సినిమాను రాసుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. కథ మొదలవ్వగానే.. క్లైమాక్స్ ఏంటో ఊహించేయొచ్చు. అంత రొటీన్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపిస్తుంది. కామెడీ వర్కవుట్ అవ్వడంతో పెద్దగా బోర్ ఫీల్ అవ్వరు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లోగా సాగుతుంది. హీరో-హీరోయిన్ల మధ్య సరైన లవ్ స్టోరీనే ఉండదు.
కేవలం పాటల కోసం లవ్ స్టోరీ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కబడ్డీ కంటే కిడ్నాప్ అయిన అమ్మాయిలను వెతికి పట్టుకోవడం పెద్ద టాస్క్ గా చూపించారు. ఎవరి హెల్ప్ లేకుండా హీరో తన టీమ్ ని వెతికి పట్టుకోవడమనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. కానీ దర్శకుడు ఆ సన్నివేశాలను థ్రిల్లింగ్ గా తీయలేకపోయాడు. క్లైమాక్స్ పరమ రోటీగా అనిపిస్తుంది.
కబడ్డీ కోచ్ గా గోపీచంద్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నిజానికి తన రోల్ అగ్రెసివ్ గా ఉన్నా.. గోపీచంద్ మాత్రం కంట్రోల్ గా నటించారు. తమన్నాది పూర్తిస్థాయి హీరోయిన్ రోల్ అని చెప్పలేం. కానీ ఆమె తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతుంటే కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో హైలైట్ గా నిలిచిన రోల్ ఎవరిదైనా ఉందంటే.. అది రావు రమేష్ పాత్రే. దర్శకుడు ఈ పాత్రను బాగా రాసుకున్నాడు. ఈ పాత్ర చెప్పే డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. భూమిక రోల్ చెప్పుకునే స్థాయిలో లేదు. నటుడు రెహ్మాన్ ఓకే అనిపిస్తాడు.
సాంకేతికపరంగా చూసుకుంటే ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీశారనిపిస్తుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లాన్ అయింది. బాలా రెడ్డి పాట మాస్ కి కనెక్ట్ అవుతుంది. డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా.. అనుకున్నంత రేంజ్ లో సినిమా లేదనిపిస్తుంది.
హైలైట్ సీన్స్ :
- రావు రమేష్ ఇంట్లో పెళ్లి చూపుల కోసం.. ఆంటీలంతా విజృంభించి తెలుగు మాస్ డైలాగ్స్ చెబుతుంటే.. రావు రమేష్ ఇచ్చే రియాక్షన్ మెప్పిస్తుంది.
- ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ మరో ప్లస్ పాయింట్.
- అమ్మాయిలంతా… తమని అల్లరి చేస్తున్న రౌడీ మూకతో కబడ్డీ ఆడే సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
- కబడ్డీ ఆడించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోనప్పుడు వాళ్లతో హీరో మాట్లాడే సీన్.. చెప్పే డైలాగ్స్ ఆలోచనలో పడేస్తాయి.