By: ABP Desam | Updated at : 24 May 2023 01:43 PM (IST)
చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణ(Photo Credit: Social Media)
‘మై విలేజ్ షో’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ, ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. చదువు రాకపోయినా, సోషల్ మీడియా ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా గంగవ్వకు ఓ పాత వీడియో తలనొప్పులు తెచ్చి పెట్టింది. చివరకు క్షమాపణలు చెప్పే వరకు చేరింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? గంగవ్వ క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఓ చానెల్ వాళ్లు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన గంగవ్వతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే సదరు చానెల్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా పలువురు రాజకీయ నాయకుల ఫోటోలు చూపించి ఆమెతో జాతకాలు చెప్పిస్తారు. కొంత మంది లీడర్ల ఫోటోలు చూసి ఆమె జాతకం చెప్తుంది. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ ఫోటోలను కూడా ఆమెకు చూపిస్తారు. వాటిని తను చూసి జాతకం చెప్పనని వెళ్లిపోతుంది. కానీ, సదరు చానెల్ వాళ్లు మళ్లీ మళ్లీ అడగడంతో “చంద్రబాబుకు గ్రహణం పట్టింది” అని గంగవ్వ చెప్తుంది. ఆ ఒక్క ముక్కను ఎడిట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. దానిని బేస్ చేసుకుని చంద్రబాబుపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్రోలింగ్ కు దిగుతున్నారు.
తాజాగా ఈ వీడియోపై గంగవ్వ స్పందించారు. చంద్రబాబు నాయుడిని తాను కావాలని అలా అనలేదని చెప్పారు. సదరు చానెల్ వాళ్లు చెప్పమంటేనే చెప్పానన్నారు. తన మాటలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని చంద్రబాబును కోరారు. “‘అందరికీ నమస్కారం. నాకు వాళ్లు ఏదైనా చెబితేనే అంటాను. నా అంతట నాకు ఏదీ అనరాదు. నేను పెద్దగా చదువుకోలేదు. ఆ సారును నేను అనను అంటే టీవీ ఛానల్ వాళ్లు అనిపించారు. మీరు తప్పుగా అనుకోవద్దు. క్షమించండి. నాకు తెలువది ఎక్కువ. అనమంటేనే అన్నా. మీ అందరి వల్లే నాకు ఇంత గూడు అయ్యింది. నేను మాట జారితే క్షమించండి” అని చెప్పుకొచ్చారు.
Em brathukulu ra meevi thupuk….Gangavva tho anipinchi….meeru cheppalsina sorry kooda thane chepthundhi kadha ra….Maanandra, lekapothe alageee potharu. pic.twitter.com/NWTIDiBXpM
— Charan (@cherri9999) May 23, 2023
తెలంగాణ యాసలో చక్కటి వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్. ఈ చానెల్ ద్వారా పాపులారిటీ సంపాదించి ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. తక్కువ రోజులు హౌస్ లో ఉన్నా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు, బుల్లితెరపైనా అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తోంది గంగవ్వ.
Read Also: టాలీవుడ్ హీరో నుంచి హన్సికకు వేదింపులంటూ వార్తలు - మీడియాపై ఆపిల్ బ్యూటీ ఆగ్రహం
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం