అన్వేషించండి

MM Keeravani Songs: గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత MM కీరవాణి స్వరపరిచిన 10 అద్భుత పాటలు ఇవే!

‘నాటు నాటు‘ పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న MM కీరవాణి ఎన్నో అద్భుత పాటలను స్వరపరిచారు. అందులో అద్భుత పాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలోనూ సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ అనే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ ఐకానిక్ పాట వెనుకున్న ప్రముఖ సంగీత స్వరకర్త ఎం ఎం కీరవాణి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఎన్నో అద్భుత పాటలను రూపొందించారు. వాటిలో టాప్ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.టు మైల్ - క్రిమినల్ (1995)

సంగీత దర్శకుడు కీరవాణి 90వ దశకంలో పలు అద్భుత పాటలను రూపొందించారు. వాటిలో బాగా పాపులర్ అయిన సాంగ్ ‘టు మైల్‌’. నాగార్జున, రమ్య కృష్ణ, మనీషా కొయిరాలా నటించిన మహేష్ భట్ సినిమా ‘క్రిమినల్’లోని ఈ పాటను కుమార్ సాను, చిత్ర, అల్కా యాగ్నిక్ పాడారు.

2.గలీ మే ఆజ్ చాంద్ నిక్లా - జఖ్మ్ (1998)

మహేష్ భట్ దర్శకత్వంలో ఆయన కుమార్తె పూజా భట్ నటించిన ‘జఖ్మ్’(1998) సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని ‘గలీ మే ఆజ్ చాంద్ నిక్లా‘ అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఆల్కా యాగ్నిక్ పాడిన ఈ పాటను ఆనంద్ బక్షి రాశారు. 

3.శివుని ఆనా - బాహుబలి: ది బిగినింగ్

‘RRR‘ రాజమౌళి ‘బాహుబలి‘ చిత్రాలతో భారతీయ దిగ్గజ దర్శకుడిగా పేరు పొందారు. ‘బాహుబలి‘ పార్ట్ 1లోని ‘శివుని ఆనా‘ అనే పాట దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.   

4.సాహోరే బాహుబలి - బాహుబలి: ది కన్‌క్లూజన్

‘బాహుబలి‘ రెండవ భాగంలోని ‘సాహోరే బాహుబలి‘ అనే పాట సైతం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. సినీ అభిమానులను ఈ పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది.   

5.పహేలి - ధీరే జల్నా (2005)

‘ధీరే జల్నా‘ సినిమాలోని  ‘పహేలి‘ పాటను వింటే ఎంతో మధురంగా అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన  సినిమాలోని పాటను సోను నిగమ్, శ్రేయా ఘోషల్ పాడారు. కీరవాణి స్వరపరిచారు.

6.ఆ భీ జా ఆ భీ జా - సుర్ (2002)

 2002లో విడుదలైన ‘సుర్‘ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ సినిమాలోని అన్ని పాటలు అద్భుతంగా ఉన్నా, ఈ పాట మరింత పాపులర్ అయ్యింది. లక్కీ అలీ పాడిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు.   

7.జాదు హై నషా హై - జిస్మ్ (2003)

బిపాసా బసు, జాన్ అబ్రహం నటించిన ‘జిస్మ్’ సినిమాలోని ‘జాదు హై నషా హై’ అనే ఐకానిక్ ట్రాక్‌ 20 ఏండ్ల నుంచి సంగీత అభిమానులకు ఎంతో ఇష్టంగా మారింది. ఇప్పటికీ పలువురి నాలికపై ఈ పాట మెదలాడుతూనే ఉంటుంది.

8.ఓ సాథియా - సాయా (2003)

జాన్ అబ్రహమ్‌ నటించిన ఈ సినిమాలో ‘ఓ సాథియా’ అనే పాటను ఉదిత్ నారాయణ్,  అల్కా యాగ్నిక్ పాడారు. ఆనంద్ బక్షి ఈ పాటను రచించారు.   

9.కంగనా రే - పహేలి (2005)

షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన ‘పహేలి’లోని అద్భుత పాట ‘కంగనా రే’. ఈ పాటను శ్రేయా ఘోషల్, మధుశ్రీ, బేలా షెండే పాడారు.

10.నీతో ఉంటె చాలు – బింబిసార(2022)

నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘బింబిసార’లోని పాట ‘నీతో ఉంటె చాలు’. శాండిల్య పిసాపతి పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతో అలరిస్తోంది.    

Read Also: 'RRR’ బాలీవుడ్ మూవీ కాదు, అసలు విషయం చెప్పిన దర్శకుడు రాజమౌళి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget