అన్వేషించండి

Urfi Javed: ‘బిగ్ బాస్’ బ్యూటీపై క్రిమినల్ కేసు, పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది!

నటి ఉర్ఫీ జావేద్ ‘ఫేక్ అరెస్ట్’ వీడియోపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెతో పాటు ఆ వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఉర్ఫీ జావేద్.. ఈమె గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. హిందీ బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, వింత వింత డ్రెస్సులు. చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు చూస్తూ ఎవ్వరైనా హవ్వా అంటూ ముక్కున వేలేసుకోవాల్సింది. గోనె సంచులు, కండోమ్స్, తాళ్లు, టేపు, కవర్లు, ఆకులు ఒకటేమిటీ ఆమె రకరకాల వస్తువులతో తయారు చేసిన డ్రెస్సులు వేసుకుని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. కొన్నిసార్లు ఈ వింత వేషధారణతో బహిరంగ ప్రదేశాల్లో తిరగడంతో పలుమార్లు వివాదానికి కారణం అయ్యింది. తాజాగా ఉర్ఫీ చేసిన ఓ పిచ్చి పని పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. ఏకంగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా తనను ముంబై పోలీసులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో ఉర్ఫీ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ రెస్టారెంట్ దగ్గర ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నది. అసభ్యకరమైన దుస్తులు ధరించినందుకు అరెస్టు చేస్తున్నట్లు సదరు పోలీసులు ఉర్ఫీతో చెప్తారు. కాసేపు, వారిపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చివరకు వారితో పాటు పోలీస్ వాహనంలో ఎక్కి వెళ్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. చిన్న దుస్తులు వేసుకుంటే అరెస్టు చేస్తారా? అంటూ ముంబై పోలీసులను నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Society (@bollywoodsocietyy)

పోలీసుల సీరియస్, క్రిమినల్ కేసు నమోదు

నెటిజన్ల విమర్శలపై పోలీసులు ఆరా తీశారు. వైరల్ వీడియోపై విచారణ జరిపారు. చివరకు ఆ వీడియో ఫేక్ అని తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ వీడియోలో ఉన్న ఉర్ఫీతోపాటు, మిగతా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ ను దుర్వినియోగం చేయడంతో  ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఫ్రాంక్ వీడియోల కోసం పోలీసుల గురించి చౌకబారు చేష్టకలు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.    

టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు

ఉర్ఫీ మొదట్లో టెలివిజన్‌లో చిన్న చిన్న పాత్రలకు సెలెక్ట్ అయ్యింది. బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా,  ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV  ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.

Read Also: షారుక్ బర్త్ డే వేడుకలో రెచ్చిపోయిన దొంగలు, ఏకంగా 30 ఫోన్లు కొట్టేశారు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget