By: ABP Desam | Updated at : 16 Apr 2023 11:46 AM (IST)
Image Credit: Sreedhar Pillai/Twitter
మన దేశంలో క్రికెట్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పోటీ ఏదైనా మన టీమ్ గెలవాలి అంటూ ఉత్కంఠగా మ్యాచ్ లు చూస్తూ ఉంటారు. ఇక మన ఇండియా టీమ్ లో ఆడే ఆటగాళ్ల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే కదా. టీమ్ ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఉందో కూడా చెప్పనవసం లేదనుకుంటా. ఆయన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా.. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన్ను అభిమానిస్తూ ఉంటారు క్రికెట్ లవర్స్. కోట్లాదిగా ఉన్న ఆయన ఫ్యాన్స్ లిస్ట్ లో కేవలం సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా చాాలా మంది ఉన్నారు. అయితే ధోని కూడా తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. వీలైన ప్రతీసారి అభిమానుల్ని పలకరిస్తుంటారు. తాజాగా ఓ సినీ నటి ఖుష్బూ అత్తమ్మను కలసి సర్ప్రైజ్ ఇచ్చారు.
ధోనీను ఆటతీరుకే కాదు ఆయన వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జీవితంలో ఆయన పడిన కష్టాలు గురించి తెలిస్తే ఎవరైనా ధోనికి చేతులెత్తి దండం పెడతారు. అలాంటి కష్టాలను అధిగమించి నేడు ప్రపంచం గుర్తించిన వ్యక్తిగా ఎదిగారు ధోని. అందుకే ఆయన్ను అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన కూడా ఖాళీ సమయం దొరికితే చాలు అభిమానులను కలవడానికి ఇష్టపడుతుంటారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. దీని తర్వాత ఏప్రిల్ 17 న బెంగళూరుతో ధోని టీమ్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు నాలుగు రోజుల ముందే ఆయన బెంగళూరు చేరుకున్నారు. ఖాళీ సమయంలో ఫ్యాన్స్ ను కలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటి ఖుష్బూ అత్తమ్మను కలిశారు ధోని. ఖుష్బూ అత్తమ్మ ధోని కు వీరాభిమాని. తన జీవితంలో ఒక్కసారి అయినా ధోనిను కలవాలి అని అనుకునే వారట. దీంతో ఖుష్బూ ఇంటికి వెళ్లి సర్పైజ్ ఇచ్చారు ధోని. ఖుష్బూ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఖుష్బు అత్త ధోనిను దగ్గరకు తీసుకొని ముద్దాడారు. ఆయనతో కలసి ఫోటోలు దిగారు. తన అభిమాన క్రికెటర్ ను కలవడం పట్ల ఖుష్బూ అత్త హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేసింది. అంతే కాదు. ధోని గురించి ప్రత్యేకంగా ఓ నోట్ కూడా రాసుకొచ్చింది.
‘‘హీరోలు ఎప్పుడూ తయారు కారు.. వారు పుడతారు.. ధోనీ ఆ విషయాన్ని ఈ రోజు నిరూపించాడు. ధోనీ ప్రేమ, ఆతిథ్యానికి నాకు మాటలు రావడం లేదు. మా అత్తగారు ధోనీని ఎంతగానో అభిమానిస్తారు. ఇప్పుడు మా అత్తమ్మను ధోని కలిశారు. ఆమె ఆయుష్షను, సంతోషాన్ని మరింత పెంచారు. ఇందుకు ధోనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా కలను నిజం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ విజిల్’ అంటూ రాసుకొచ్చింది ఖుష్బూ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also: ‘బాహుబలి‘ రేంజిలో తెరకెక్కుతున్న సూర్య లేటెస్ట్ మూవీ, టైటిల్ ఫిక్స్, విడుదల ఎప్పుడంటే?
Heroes are not made, they are born. Dhoni proves that. I am at loss for words for our CSK #Thala @msdhoni at his warmth & hospitality. He met my ma in law, who at 88, hero worships Dhoni & cannot see beyond him. Mahi, you have added many years of good health & happiness to her… pic.twitter.com/darszdzb62
— KhushbuSundar (@khushsundar) April 14, 2023
వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!
రెహమాన్, వడివేలు పాట - కన్నీళ్లు పెట్టుకున్నకమల్ హాసన్!
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?