News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Heart Of Stone Review: ఆలియా భట్ మొదటి హాలీవుడ్ సినిమా ఎలా ఉంది? ‘వండర్ వుమన్’ను డామినేట్ చేసిందా?

ఆలియా భట్ హాలీవుడ్ డెబ్యూ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ :  హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లిష్, తెలుగు డబ్)
రేటింగ్ : 2/5
నటీనటులు : గాల్ గాడోట్, ఆలియా భట్, జేమీ డోర్నాన్, సోఫీ ఒకెనాడో తదితరులు
ఛాయాగ్రహణం : జార్ట్ స్టీల్
సంగీతం : స్టీఫెన్ ప్రైస్
నిర్మాణం : స్కైడాన్స్, మాకింగ్‌బర్డ్ పిక్చర్స్
రచన: గ్రెగ్ రుకా, ఆలిసన్ ష్రోయెడర్
దర్శకత్వం : టామ్ హార్పర్
విడుదల తేదీ: ఆగస్టు 11, 2023
ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్

హాలీవుడ్ సినిమాలకు భారతదేశం మెల్లగా పెద్ద మార్కెట్‌గా మారుతోంది. మనదేశంలో కూడా ఇంగ్లిష్ సినిమాలు వందల కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొడుతున్నాయి. దీంతో భారతీయ నటులను కూడా హాలీవుడ్ సినిమాల్లో తీసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా ఇప్పటికే పూర్తిగా హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయారు. దీపికా పదుకోనే, ధనుష్ లాంటి స్టార్స్ ఇప్పటికే హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ ఆలియా భట్ వంతు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఇంగ్లిష్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’తో ఆలియా భట్ కూడా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాలో ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడోట్‌కు ఎదురుగా నెగిటివ్ రోల్‌లో ఆలియా కనిపించారు. ఈ సినిమా శుక్రవారం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?

కథ: రేచెల్ స్టోన్ (గాల్ గాడోట్) బ్రిటిష్ గూఢచార సంస్థ ఎంఐ6లో స్పై. కానీ రహస్యంగా ‘ది ఛార్టర్’ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కోసం పని చేస్తూ ఉంటుంది. ఒక మిషన్ మీద రేచెల్ స్టోన్ తన ఎంఐ6 టీమ్‌తో ఇటలీ వెళ్తుంది. కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. దీంతోపాటు ఎంఐ6 కమ్యూనికేషన్ సిస్టంలోకి ఒక గుర్తు తెలియని యువతి (ఆలియా భట్) ఎంటర్ అవుతుంది. ఆ యువతి ఎవరో తెలుసుకోవడానికి రేచెల్ స్టోన్... ఛార్టర్ సాయం తీసుకుంటుంది. అప్పుడు తనను భారతదేశంలోని పుణేకు చెందిన 22 సంవత్సరాల కేయా ధావన్‌గా గుర్తిస్తారు. ‘హార్ట్’ అనే డివైస్ ద్వారా ఛార్టర్ ఏజెన్సీ తమ మిషన్స్‌లో విజయం సాధిస్తూ ఉంటుంది. ఒక పనిని ఎలా చేస్తే అందులో 100 శాతం విజయం లభిస్తుందో ఈ ‘హార్ట్’ ముందుగానే చెబుతుంది. దీనికి మరింత ట్రైనింగ్ ఇస్తే ఇది భవిష్యత్తును కూడా కచ్చితంగా అంచనా వేస్తుందని తెలుస్తోంది. దీని కోసమే కేయా ధావన్ వచ్చిందని తెలుసుకున్న రేచెల్ ఏం చేసింది? ‘హార్ట్’ కేయా ధావన్‌కి చిక్కిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఆ సిరీస్‌లో వరుసపెట్టి సినిమాలు తీస్తూనే ఉండవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బాక్సాఫీస్ అక్షయపాత్ర లాంటివన్న మాట. ఇదే సిద్ధాంతం ఓటీటీలకు కూడా వర్తిస్తుంది. మంచి కంటెంట్‌ను ఎవరైతే అందిస్తారో వారికే సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. ఇంటర్నేషనల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్’ స్పై థ్రిల్లర్స్‌లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఒక మంచి స్పై థ్రిల్లింగ్ ఫిల్మ్ సిరీస్ కోసం చూస్తోంది. ఈ దారిలోనే ‘రెడ్ నోటీస్’, ‘ది గ్రే మ్యాన్’, ‘6 అండర్‌గ్రౌండ్’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్ స్పై థ్రిల్లర్‌గా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కూడా వచ్చేసింది. మరి నెట్‌ఫ్లిక్స్‌కు అవసరమైన సక్సెస్‌ను, బూస్ట్‌ను ఈ సినిమా అందించిందా అంటే పెదవి విరుపులే వినిపిస్తాయి.

ఈ సినిమా నిడివి రెండు గంటలు. ఇందులో స్టార్టింగ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ నిడివి సరిగ్గా 20 నిమిషాలు ఉంటుంది. పోనీ అదేమైనా ఆకట్టుకునేలా ఉంటుందా? అంటే అదీ లేదు. పైన కథలో చెప్పిన ‘ది హార్ట్’ అనే డివైస్ ఎలా పని చేస్తుందో ఆడియన్స్‌కు చూపించే డెమో అనుకోవచ్చు. ఆలియా భట్ కూడా ఈ సీన్లోనే తళుక్కున మెరిసి మాయం అవుతుంది. ఒక కొండ మీద నుంచి కిందకి దిగడానికి ప్యారాషూట్, రోప్ వే, స్కీ బైక్... ఇలా కనిపించినవన్నీ గాల్ గాడోట్ వాడేస్తుంది కానీ ఇంకెంత సేపు ఇదంతా అని ఆడియన్స్‌కు అనిపిస్తుంది.

మరి యాక్షన్ ఎపిసోడ్స్ బాలేవా అంటే అది కూడా కాదు. పోర్చుగల్‌లో జరిగే యాక్షన్ సీక్వెన్స్, దాని తర్వాత వచ్చే ఛేజ్ సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతాయి. క్లైమ్యాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్ జస్ట్ ఓకే అన్నట్లు ఉంటుంది. కానీ దాని తర్వాత కథ మళ్లీ రొటీన్ టర్నే తీసుకుంటుంది. మొదటి గంట తర్వాత వచ్చే ట్విస్ట్‌ని సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల్లోనే గెస్ చేయవచ్చు. రైటింగ్ అంత స్ట్రాంగ్‌గా ఉంది మరి. ఆలియా భట్‌కు మంచి నిడివి ఉన్న పాత్ర లభించింది. కానీ ప్రారంభంలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించిన ఆలియా పాత్ర గ్రాఫ్ మెల్లగా డౌన్ అయిపోతుంది. కానీ కథలో కీలకం అయిన పాత్ర మాత్రం తనదే.

రచయతల బృందం కథను గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. నిజానికి ఒక డివైస్ కోసం హీరో, విలన్ కొట్టుకోవడం ఇదే మొదటి సారి కాదు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’లో గాడ్స్ ఐ అనే డివైస్ కోసం పోరాటం జరుగుతుంది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో అయితే ఒక ఏఐ డివైస్‌నే విలన్. కానీ ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయంటే రైటింగ్‌లో ఉన్న బలం. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా నడుస్తూనే, కళ్లు తిప్పుకోనివ్వని యాక్షన్ సీన్లతో మైండ్ బ్లాక్ చేస్తారు. కానీ ఇందులో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే లేదు. ఆకట్టుకునే యాక్షన్ సీన్ కూడా ఒకటే ఉంటుంది. 

యాక్షన్ సీన్లకు నేపథ్య సంగీతం ప్రాణం పోయాలి. కానీ స్టీఫెన్ ప్రైస్ అందించిన సంగీతం ఆ స్థాయిలో లేదు. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణ విలువలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు.

Also Read మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ఇక నటీనటుల విషయానికి వస్తే... రేచెల్ స్టోన్ పాత్రలో గాల్ గాడోట్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రలు తనకు కొట్టిన పిండి కాబట్టి అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇక ఆలియాకు ఇలాంటి పాత్ర కొంచెం కొత్త. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించింది. మిగతా పాత్రలు పోషించిన వారందరూ తమ పరిధి మేర నటించారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉండి మీకు ఖాళీ సమయం ఉంటే ఫార్వర్డ్ చేసుకుంటూ ఒకసారి చూడవచ్చు.

Also Read  'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

Published at : 11 Aug 2023 08:09 PM (IST) Tags: Alia Bhatt ABPDesamReview Heart Of Stone Movie Gal Gadot Heart of Stone Heart Of Stone Review in Telugu Heart Of Stone Review

ఇవి కూడా చూడండి

Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా

Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా

Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్

Athidhi Web Series Review - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్  సిరీస్

Ramanna Youth Review - 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!

Ramanna Youth Review - 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!

Mark Antony Review - 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?

Mark Antony Review - 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి

Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి

50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్‌ - ట్రూడోపై ఓటర్ల అసహనం

50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్‌ - ట్రూడోపై ఓటర్ల అసహనం

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు