MM Keeravani: వరల్డ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ కు పెద్దన్న టెన్షన్!
ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్‌కు పెద్దన్న ఎంఎం కీరవాణి షాక్‌లు ఇస్తున్నాడు.
Hans Zimmer... హాలీవుడ్ మూవీస్ ను నిశితంగా చూసే వారు ఎవరికైనా బాగా తెలిసిన పేరు. వరల్డ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పినా తప్పు లేదేమో. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాల లైనప్ చూసినా కళ్లు చెదిరిపోతాయి.
తాజాగా టాప్ గన్, గతంలో డ్యూన్, అసలు క్రిస్టోఫర్ నోలన్‌కైతే నిన్న మొన్నటి వరకూ ఆస్థాన విద్వాంసుడు హాన్స్ జిమ్మరే...ఓ డార్క్ నైట్, ఓ ఇన్ సెప్షన్, ఓ ఇంటర్ స్టెల్లార్, డన్ కిర్క్, ఇంకా చెప్పాలా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, షెర్లాక్ హోమ్స్, స్పైడర్ మ్యాన్, జేమ్స్ బాండ్ నో టైమ్ టూ డై, లయన్ కింగ్ అబ్బో 80వ దశకం నుంచి ఇప్పటి యంగ్ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ వరకూ హాన్స్ జిమ్మర్ చేతిలో సినిమా పెడితే చాలు ఆయనే వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోతారు. అంత గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్ ఇవ్వగల నైపుణ్యం ఆయన సొంతం.
వరల్డ్ వైడ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా హాన్స్ జిమ్మర్ ను ఓ ఐదు నిమిషాలు కలిస్తే చాలు అనుకుంటారు అలాంటిది అలాంటి హాన్స్ జిమ్మర్ ను ఓ తెలుగోడు ఓడిస్తున్నాడని తెలుసా. ఎస్. అది ఇంకెవరో కాదు మన ఎం ఎం కీరవాణి.
హాన్స్ జిమ్మర్ ఏంటీ ఎం ఎం కీరవాణి ఏంటీ అనుకుంటున్నారా. RRR సినిమా ఇప్పుడు వరల్డ్ అవార్డుల రేసులో దూసుకెళ్తోంది. నిన్న మొన్నటి వరకూ హాలీవుడ్ ప్రశంసలు నేడు అవార్డులు. వరుసగా గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్, లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు మూడింటిలోనూ నాటు నాటు పాట ది బెస్ట్ సాంగ్ గా అవార్డులను అందుకుంది.
ఈ ప్రాసెస్ లో మన ఎం ఎం కీరవాణి నామినేషన్స్ లో ఉన్న ఎవరెవరెని ఓడించి ఈ అవార్డును అందుకుంటున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. మూడు నామినేష్స్ లోనూ టాప్ గన్ పోటీపడింది. టాప్ గన్ రీసెంట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్. అందులో లేడీగాగా రాసుకుని పాడిన హోల్డ్ మై హ్యాండ్ సాంగ్ ఆస్కార్ సహా అన్ని ప్రఖ్యాత అవార్డు రేసుల్లోనూ ఉంది.
వీళ్లే కాదు యంగ్ పాప్ సంచలన రిహానా బ్లాక్ పాంథర్ సినిమా కోసం రాసుకుని పాడిన లిఫ్ట్ మీ అప్ సాంగ్ కూడా ఈ మూడు అవార్డుల రేసుల్లోనూ ఉంది. అయితే ఇంతటి మ్యూజిక్ లెజండ్స్ ను, సంగీత సంచనాలన్ని వెనక్కి నెడుతూ మన తెలుగు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్, లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను గెలుచుకోవటం అది మాములు విషయం కాదు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే ఆస్కార్ రేసులోనూ RRR నాటు నాటుతో మన మరకతమణి ఈ మ్యూజిక్ సెన్సేషన్స్ కు షాకిస్తారేమో చూడాలి.