అన్వేషించండి

Meter movie trailer: ‘మీటర్’ ట్రైలర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సెట్టయ్యినట్లేనట!

కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన తాజా సినిమా ‘మీటర్‌’. రమేష్‌ కాదూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అదే జోష్ తో మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’ త్వరలో థియేటర్లలో అలరించబోతోంది. రమేష్ కడూరి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తోంది.

అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 

సమ్మర్ స్పెషల్ గా ‘మీటర్’ మూవీ ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రంలో కిరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఎవరినీ పట్టించుకోని, తన స్వంత నిర్ణయాల ప్రకారం ముందుకు సాగే పోలీసుగా కిరణ్ అబ్బవరం యాక్షన్-ప్యాక్డ్ ఎంట్రీతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అమ్మాయితో ప్రేమలో పడటంతో పాటు, రాజకీయ నాయకుడితో కయ్యానికి కాలుదువ్వుతారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్

తండ్రి కోరిక మేరకు కిరణ్ పోలీసు అవుతారు. తండ్రి ప్రేరణతో డ్యూటీని సీరియస్‌గా తీసుకుంటారు. తన పోలీసు ప్రయాణంలో పొలిటీషియన్స్ తో పాటుపై అధికారులతోనూ ఢీకొడతారు. ‘‘భగవంతుడి ముందు భక్తితోనూ బలవంతుడి ముందు భయంతోనూ ఉండాలి” అని విలన్ చెప్పే డైలాక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఓవైపు సీరియస్ గా ఉంటూనే మరోవైపు కామెడీని పండిస్తారు. ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్విరాజ్, సప్తగిరి కామెడీ భాగానే పండిస్తారు. ఈ చిత్రంలో అతుల్య రవి గ్లామ్ డాల్‌గా కనిపించింది. ఇతర నటీనటులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ సి దిలీప్ అద్భుతమైన పనితీరు కనబర్చారు. సాయి కార్తీక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విజువల్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్లారు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. కిరణ్ అబ్బవరం ఈసారి హిట్టు కొట్టేలాగే ఉన్నాడు. ట్రైలర్ ఒకే. కానీ, పూర్తి నిడివి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఇక ‘రాజావారు రాణిగారు’ సినిమాతో సినిమా రంగంలోకి కిరణ్ అడుగు పెట్టారు.  ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  గీతా ఆర్ట్స్‌ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ మీద చిరంజీవి, హేమలత  ‘మీటర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ కాడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో పవన్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  ఏప్రిల్ 7, 2023న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌ కాబోతున్నది.

Read Also: దుమ్మురేపుతున్న‘చమ్కీల అంగీలేసి’ సాంగ్, సోషల్ మీడియాకు కొత్త వైరస్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget