IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Mehreen Pirzada: అలాంటి సీన్లు చేయనంటున్న హీరోయిన్... మరి అవకాశాలు వస్తాయా?

హీరోయిన్ మెహ్రీన్ తన కంటూ కొన్ని పరిమితులు నిర్ణయించుకుంది, ఆ పరిధి దాటి నటించనని చెబుతోంది.

FOLLOW US: 

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మెహ్రీన్ పిర్జాదా. సినిమా హిట్టు, ఫట్టులతో సంబంధం లేకుండా ఆమెకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపునే కాదు, అభిమానుల్లో క్రేజ్‌ను కూడా సంపాదించుకుంది. రెండు మూడు సినిమాల్లో బికినీలు కూడా వేసింది. అంతెందుకు ఎఫ్2 సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి బికినీతో కనిపించి కనువిందు చేసింది. అయితే ఆమె తన చుట్టు కొన్ని పరిధులు గీసుకుందని, కొన్ని సీన్లలో నటించేందుకు నిరాకరిస్తోందని టాలీవుడ్ టాక్. ముఖ్యంగా బోల్డ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు, బెడ్రూమ్ సీన్లు చేయనని ముందే చెప్పేస్తోందట. కథ డిమాండ్ చేసినా కూడా తాను మాత్రం చేయనని స్పష్టం చేస్తోందట. దీంతో దర్శకులు, నిర్మాతలు కూడా ఆమెకు అవకాశం ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం. ‘నన్ను నేను ధైర్యవంతురాలినని నిరూపించుకునేందుకు అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం లేదు’ అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. మెహ్రీన్ తమిళంలో నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో మాత్రం బిజీగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో నటిస్తోంది.  అలాగే కన్నడలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. 

పంజాబ్‌కు చెందిన ఈ హీరోయిన్ 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో మహాలక్ష్మి పాత్రతో నటనకు పరిచయమైంది. ఆ తరువాత 2017లో ఫిల్లౌరీ సినిమాతో బాలీవుడ్లో నటించినప్పటికీ ఆ సినిమా గుర్తింపు తేలేదు. దీంతో తెలుగు, తమిళ సినిమాలకే పరిమితమైపోయింది మెహ్రీన్. తాజాగా ఆమె నటించిన మంచి రోజులొచ్చాయి సినిమా విడుదలైంది. అందులో సంతోష్ శోభన్‌కు జతగా నటించింది. ఆ సినిమాలో బరువు తగ్గి చాలా సన్నగా మారింది మెహ్రీన్. 

మెహ్రీన్ కొన్ని నెలల క్రితం హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఆ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంటున్నట్టు కొన్ని రోజులకే ప్రకటించింది. సినిమాలకు దూరంగా ఉండమని కోరడం వల్లే మెహ్రీన్ పెళ్లి రద్దు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ విషయంపై ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. 

Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద‌ కొట్టిన రాజమౌళి
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Dec 2021 05:45 PM (IST) Tags: Mehreen Pirzada మెహ్రీన్ పిర్జాదా Mehreen bold మెహ్రీన్ ఎఫ్3

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి