Mangalavaaram Trailer : రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా ‘మంగళవారం’, ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్
రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ‘మంగళవారం’ సినిమా ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఊరును వెంటాడుతున్న వరుస హత్యలకు కారణం ఏంటి? అనే అంశంతో ఈ ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది.
‘RX100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచాయి. అసలు సినిమా టైటిలే చాలా కొత్తగా ఆసక్తి కలిగిస్తోంది. ‘మహాసముద్రం’ చిత్రంతో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆయన ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు. హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం వరుస అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఆకట్టుకుంటున్న ‘మంగళవారం’ ట్రైలర్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు మేకర్స్. ఈ ట్రైలర్ లో కథను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు అజయ్. మంగళవారం వచ్చిందంటే చాలు ఆ ఊరిలో ఓ శవం లేవాల్సిందే. అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? మంగళవారం నాడే ఎందుకు చేస్తున్నారు? ముసుగు వేసుకుని గోడలపై రాతలు రాసేది ఎవరు? ప్రజల కంటి మీద కునుకులేకుండా వణికిస్తున్నది ఎవరు? అనేది ఏమాత్రం తెలియకుండా దర్శకుడు ట్రైలర్ ను వదిలాడు. విజువల్స్ ఎఫెక్ట్, ఊరి సెటప్ అదుర్స్ అనిపిస్తున్నాయి. అజనీష్ లోక్ నాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, అజ్మల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘RX100’తో సంచలనం విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి.. ‘మహా సముద్రం’ చిత్రంతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ‘మంగళవారం’ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకోవాలి అనుకుంటున్నాడు.
‘మంగళవారం’ టీమ్ కు మెగాస్టార్ ఆల్ ది బెస్ట్
అటు ‘మంగళవారం’ సినిమా ట్రైలర్ ను తన చేత విడుదల చేయించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. “‘మంగళవారం' సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా వుంటుంది. వాళ్ళు వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీతో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరు. స్వాతిరెడ్డి లాంటి యంగ్ స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్ !!” అని చెప్పారు.
‘మంగళవారం' సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా… ఉంటుంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 21, 2023
Read Also: 3 భాగాలుగా ‘మహా భారతం‘- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన నిర్ణయం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial