By: ABP Desam | Updated at : 07 Jan 2023 02:48 PM (IST)
చిరంజీవి, సుమ కనకాల (Image Courtesy : Mallemala Tv / YouTube)
'డోంట్ స్టాప్ లాఫింగ్... సుమ అడ్డా (Suma Adda TV Show) లోడింగ్' అని చిరంజీవి (Chiranjeevi) చెప్పారు. అదేంటి? 'డోంట్ స్టాప్ డ్యాన్సింగ్... పూనకాలు లోడింగ్' అనేది కదా డైలాగ్! మరి, మెగాస్టార్ ఎందుకు మార్చారు? అని ఆలోచనలో పడ్డారా? అయితే, కింద ప్రోమో మీద ఓ లుక్ వెయ్యాల్సిందే.
సంక్రాంతికి చిరు స్పెషల్ అడ్డా
'సుమ అడ్డా' పేరుతో ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల (Suma Kanakala) ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ రోజు సంక్రాంతికి విడుదల కానున్న 'కళ్యాణం కమనీయం' హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ వచ్చారు. ఇంకా డ్యాన్స్ మాస్టర్లు శేఖర్, జానీ, నటుడు పోసాని సందడి చేశారు. అసలు ఎపిసోడ్ ముందుంది.
అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చిన 'సుమ అడ్డా' ప్రసారం కానుంది. సంక్రాంతికి విడుదల కానున్న 'వాల్తేరు వీరయ్య' ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జనవరి 13న సినిమా విడుదల అవుతుంది. 14న శనివారం. ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని సమాచారం. బుల్లితెరకు మెగా టచ్ యాడ్ కావడంతో ఆ రోజు వెండితెరపై మాత్రమే కాదు... బుల్లితెరలోనూ చిరు సందడి ఉంటుందని చెప్పవచ్చు.
Also Read : బాలకృష్ణ సేఫ్ - ఒంగోలులో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏమైందంటే?
ఈ రోజే ట్రైలర్!
Waltair Veerayya Trailer : చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేయనున్నారు. రేపు విశాఖలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది. దానికి చిత్ర బృందం అంతా హాజరు కానుంది. విశాఖలోని వేడుకలో 'నాకు ఏమో తొందర ఎక్కువ, నీకు ఏమో అందం ఎక్కువ' పాట విడుదల చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. కొన్ని విమర్శలు కూడా ఉన్నాయనుకోండి. అయితే... దేవి శ్రీ ప్రసాద్ పాటలకు తొలుత విమర్శలు, ఆ తర్వాత వ్యూస్ రావడం కామన్ అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
రొటీన్ కమర్షియల్...
రాసుకోండి! కానీ...
ఆల్రెడీ విడుదలైన 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగులో చిరంజీవి స్టిల్స్, 'గ్యాంగ్ లీడర్' రోజులను గుర్తు చేశాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే... సినిమా రెడీ అయ్యింది. చిరంజీవి చూశారు కూడా! రొటీన్ సినిమాలా ఉందని అంటున్న ప్రేక్షకులకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ''రాసుకోండి, ఇది రొటీన్ సినిమానే. కానీ, లోపల వేరుగా ఉంటుంది'' అని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి సరసన శృతి హాసన్ నటించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించనున్నారు.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?
Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్
Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
Pawan Kalyan - Sujeeth: పవర్ స్టార్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్, పవన్ - సుజిత్ కొత్త మూవీ షురూ
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు