Marvel Studio Delay: ప్రతిష్టాత్మక మార్వెల్ మూవీస్ విడుదల ఆలస్యం, కారణాలు ఏంటో తెలుసా?
డిస్నీ కీలక విషయాన్ని వెల్లడించింది. మార్వెల్ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పలు సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
డిస్నీ 'బ్లేడ్', 'డెడ్‌పూల్ 3', 'ఫెంటాస్టిక్ ఫోర్' సహా ఇతర ప్రధాన మార్వెల్ సినిమాల విడుదల తేదీలను మార్చింది. షఫుల్‌లో భాగంగా, 'బ్లేడ్' సినిమా విడుదలను నవంబర్ 3, 2023 నుంచి సెప్టెంబర్ 6, 2024కి వాయిదా వేసింది. 'డెడ్‌పూల్ 3' సెప్టెంబర్ 6, 2024 నుంచి నవంబర్ 8, 2024కి వాయిదా పడింది. 'ఫెంటాస్టిక్ ఫోర్' నవంబర్ 8, 2024న విడుదల చేయాలని భావించినా, ఫిబ్రవరి 14, 2025కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇంకా టైటిల్ పెట్టని మార్వెల్ మూవీ ఫిబ్రవరి 14, 2025 నుంచి నవంబర్ 7, 2025కి మార్చింది. 'ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్' నవంబర్ 7, 2025న విడుదల కావాల్సి ఉండగా మే 1, 2026కు పోస్టు పోన్ చేయబడింది. మే 1, 2026న విడుదల కావాల్సి ఉన్న మరో సినిమా మార్వెల్ ఫిల్మ్ డిస్నీ క్యాలెండర్ నుండి తొలగించినట్లు 'వెరైటీ' నివేదిక వెల్లడించింది.
Marvel Studios delayed movies.
— BD (@BrandonDavisBD) October 11, 2022
-Blade goes from 11/3/23 to 9/6/24
-Deadpool 3 goes from 9/6/24 to 11/8/24
-Fantastic Four drops 11/8/24 for 2/14/25
-Untitled Marvel film on 2/14/25 moves to 11/7/25
-Avengers: Secret Wars moves from 11/7/25 to 5/1/26https://t.co/aXveR1NlfF pic.twitter.com/2VGDrqbvQz
అటు సంగీతకారుడు చెవాలియర్ డి సెయింట్-జార్జెస్ పాత్రలో కెల్విన్ హారిసన్ జూనియర్ నటించిన సెర్చ్‌లైట్ చారిత్రక నాటకం 'చెవాలియర్' ఏప్రిల్ 7, 2023న థియేటర్లలో విడుదలకానుంది. 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' మే 24, 2024న విడుదల చేయనున్నట్లు డిస్నీ ప్రకటించింది. 'ఎ హాంటింగ్ ఇన్ వెనిస్' సెప్టెంబర్ 15, 2023 తేదీన రిలీజ్ అవుతుంది. .
సినిమాల విడుదల వాయిదాకు అసలు కారణం బస్సం తారిఖ్!
'బ్లేడ్' విషయానికొస్తే, బస్సం తారిఖ్ ప్రాజెక్ట్ నుంచి ఇటీవల తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు దర్శకుడు లేరు. ఈ సినిమా ఆలస్యం కావడం మూలంగా మిగతా సినిమాల షెడ్యూల్ అంతా పోస్ట్ పోన్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం నిలిచిపోయింది. టైటిల్ వాంపైర్ స్లేయర్‌గా మహేర్షలా అలీ నటించారు. కొత్త హెల్మర్‌ను నియమించాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన కథాంశాల కారణంగా, 'బ్లేడ్' సినిమా నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోంది. ఈ ప్రభావం మిగతా సినిమాల మీద పడింది. మార్కెల్ నుంచి తదుపరి చిత్రంగా 'బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్' నవంబర్ 11న బిగ్ స్క్రీన్ మీద విడుదల కాబోతుంది.
“Show them who we are.” Watch the brand-new trailer for Marvel Studios’ Black Panther: #WakandaForever, only in theaters November 11.
— Marvel Studios (@MarvelStudios) October 3, 2022
Get tickets now: https://t.co/XGLcVknhzs pic.twitter.com/VZC5x1zern
మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన
అటు జూలైలో శాన్ డియాగో కామిక్-కాన్‌లో 'ఫెంటాస్టిక్ ఫోర్' సిక్త్ ఫేజ్ ను ప్రారంభిస్తుందని మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫీగే వెల్లడించారు. 'బ్లేడ్', 'డెడ్‌పూల్ 3' తో పాటు మరో రెండు సినిమాలను ఫిఫ్త్ ఫేజ్ లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.