News
News
X

Manjima Mohan: హీరోతో ప్రేమాయణం - అఫీషియల్ గా వెల్లడించిన నటి!

తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది మంజిమా మోహన్.

FOLLOW US: 
 
కోలీవుడ్ నటుడు గౌతమ్ కార్తిక్(Gautham Karthik), మంజిమా మోహన్(Manjima Mohan) ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా తమ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది మంజిమా మోహన్. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. గౌతమ్ గురించి గొప్పగా రాసుకొచ్చింది. 

Manjima Mohan announces her relationship with Gautham Karthik: 'మూడేళ్ల క్రితం నేను అన్నీ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు గార్డియన్ ఏంజిల్ లా నువ్ నా లైఫ్ లోకి వచ్చావ్. జీవితంపై నా దృక్పథాన్ని మార్చావ్. నా లైఫ్ గందరగోళంగా అనిపించిన ప్రతీసారి ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు లాగడానికి ప్రయత్నించావ్. నా లోపాలను నేను అంగీకరించి లైఫ్ లీడ్ చేసేలా చేశావ్. నన్ను ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు. నువ్వే నాకన్నీ' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, అభిమానులు మంజిమా, గౌతమ్ లకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

2019లో దేవరత్తమ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటినుంచి వీరిద్దరూ చెన్నైలో కలిసే ఉంటున్నారని సమాచారం. ఇప్పుడు వీరి పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుంది. 

అలనాటి హీరో నవరస నయగన్‌ కార్తీక్‌ తనయుడే గౌతమ్‌ కార్తీక్‌.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కడల్' అనే సినిమాతో గౌతమ్ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాను 'కడలి' అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా.. గౌతమ్‌కు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం 'పాతు తల' అనే సినిమాలో నటిస్తున్నారు గౌతమ్ కార్తీక్. ఇక మంజిమా మోహన్ విషయానికొస్తే.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత 'ఎన్టీఆర్' బయోపిక్ లో కనిపించింది. ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటిస్తోంది. 

News Reels

Also Read: 'ఫ్యాన్స్ నన్ను కొడతారు' - ప్రభాస్‌తో సినిమాపై మారుతి కామెంట్స్!

View this post on Instagram
 
A post shared by Manjima Mohan (@manjimamohan)

Published at : 31 Oct 2022 07:50 PM (IST) Tags: Manjima Mohan Gautham Karthik Gautham Karthik Manjima Mohan Love

సంబంధిత కథనాలు

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా -  గిప్పడి సంది లెక్కలు టక్కర్

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

టాప్ స్టోరీస్

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

AP BJP Reaction On Sajjla :  మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!

హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్ చూశారా!