అన్వేషించండి
Advertisement
Aadavallu Meeku Johaarlu Movie: 'మాంగల్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా' పెళ్లి కోసం శర్వానంద్ బాధ
శర్వానంద్, రష్మికా మందన్నా జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో కొత్త పాటను విడుదల చేశారు.
శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఇప్పుడు ఈ సినిమాను మార్చి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించింది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటూ యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్, సాంగ్స్ ను రిలీజ్ చేశారు.
తాజాగా సినిమాలో నాలుగో పాటను రిలీజ్ చేశారు. 'మాంగల్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా' అంటూ సాగే ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది. పెళ్లి జరగడం లేదని హీరో పడే బాధని ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేశారు. జస్ప్రీత్ జాజ్ పాడిన ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లిరిక్స్ అందించారు. అలానే ఆయన మ్యూజిక్ కూడా బాగుంది. ఈ పాటలో శర్వా సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ ప్రధాన పాత్రల్లో, 'వెన్నెల' కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion