Manchu Lakshmi Corona: మంచు లక్ష్మికి కోవిడ్.. రకుల్ ప్రీత్ సింగ్ సలహా ఇది
మంచు లక్ష్మికి కోవిడ్-19 సోకింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు.

కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అకస్మాత్తుగా పెరిగిన వైరస్.. ఇప్పుడు గుండెల్లో గుబులు పెట్టిస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత, నటి, యాంకర్ మంచు లక్ష్మికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రెండు సంవత్సరాల పాటు కరోనాకు దొరక్కుండా తప్పించుకుంటున్న తనను ఆ మహమ్మారి సోకిందని, ఇప్పుడు కరోనాతో పోరాడతానని ట్వీట్‌లో పేర్కొంది. అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది.
‘‘సాధారణ జలుబులా ఇది అందరికీ సోకుతోంది. మన రోగనిరోధక శక్తిని పెంచుకుని, వైరస్‌తో పోరాడటానికి మన శరీరాన్ని సిద్ధం చేయాలి. విటమిన్లను తప్పనిసరిగా తీసుకుంటూ, మెదడును, శరీరాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ రెండు డోసులు తీసుకున్నట్లయితే.. బూస్టర్ కూడా తీసుకోండి. మీ టాప్-3 ఫేవరెట్ షోలు, సినిమాలను నాకు తెలపండి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
Also Read: 'మనీ హైస్ట్' నటి ఇంట్లో గణపతి ఫొటో.. వైరల్ అవుతోన్న పోస్ట్..
ఈ పోస్ట్ చూసిన ఆమె ఫ్రెండ్, నటి రకుల్ ప్రీత్ సింగ్ వెంటనే స్పందించింది. ఆమెను Succession వెబ్‌సీరిస్ చూడాలని సలహా ఇచ్చింది. గతవారం మంచు మనోజ్ కూడా తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌లోనే ప్రకటాంచాడు. సరిగ్గా తనకు పాజిటివ్ వచ్చిన వారానికే మంచు లక్ష్మికి కూడా కరోనా సోకింది. ఇటీవలే మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబు ఇంటిని అభిమానులను చూపించేందుకు హోంటూర్ చేసింది. అది యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండవ్వుతోంది.
View this post on Instagram
Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..
Also Read: అజిత్ సినిమాకు కరోనా ఎఫెక్ట్... వలిమై రిలీజ్ వాయిదా వేసిన చిత్ర బృందం
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















