Manchu Lakshmi: అత్యంత అందమైన మహిళగా మంచు లక్ష్మికి అరుదైన గౌరవం
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి.. తండ్రి నటనా దారిలో నడడవమే కాకుండా సింగర్ గా, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది..
ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. నిత్యం వార్తల్లో ఉంటారు. ఆమె మాటలకు ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముద్దు ముద్దు మాటలతో మంచు లక్ష్మీ ట్రోలర్స్‌కు బోలెడంత పని కల్పిస్తుంటారు. మంచు లక్ష్మి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడప్పుడు ఆమె తన జిమ్ ఫొటోలను అభిమానులతో షేర్ చేస్తుంటారు. అయితే, ఈ సారి ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అతికొద్ది మందికి మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని లక్ష్మీ దక్కించుకున్నారు.
టీసీ కండ్లెర్ అనే మ్యాగజైన్ ప్రతి సంవత్సరం 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మి ఈ లిస్టుకు నామినేట్ అయ్యారు. ఇండియాలో 100 అత్యంత అందమైన ముఖాలు (100 most beautiful faces) జాబితాకు లక్ష్మీ నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని లక్ష్మి స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్లడించారు. ఆమెను నామినేట్ చేసిన పాట్రియోన్ సంస్థకు ధన్యవాదాలు చెబుతూ లక్ష్మీ ఈ పోస్టు పెట్టారు.
ఈ ఏడాదికిగాను తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి మంచు లక్ష్మి ఎన్నికవ్వడం పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న మంచు కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీకి కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మరో వైపు ఈ అరుదైన జాబితాకు ఆమె నామినేట్ కావడం పట్ల సోషల్ మీడియాలో మరికొంత మంది విపరీమైన ట్రోల్ చేస్తున్నారు.
టీసీ కండ్లెర్ అనే సంస్థ 1990 నుంచి పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే సినిమా, టీవీ, పాప్ సెలబ్రిటీలను గుర్తించి ఈ జాబితాలోకి చేర్చుతుంది. మొత్తం 100 మందికి ఈ లిస్టులో ప్లేస్ కల్పిస్తుంది. ఈ ఏడాదికి గాను తెలుగు నుంచి మంచు లక్ష్మి చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి ఇంకొంత మంది కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?
View this post on Instagram
మంచు లక్ష్మి అమెరికాలో ఉన్నప్పుడు కొన్ని హాలీవుడ్ సిరీస్ లలో నటించారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఇండియాలోనే ఉంటున్నారు. ‘అనగనగా ధీరుడు’ సినిమాతో మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. తొలి సినిమాలో మంచి నటన కనబర్చి నంది అవార్డును సైతం అందుకున్నారు. ఆ తర్వాత సింగర్ గా మారి బెస్ట్ సెలబ్రిటీ సింగర్ గా గామా అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ లో సొంతంగా ఓ చానెల్ కూడా రన్ చేస్తున్నారు. ఇందులో ఫిట్ నెస్, సినిమాలకు సంబంధించిన వివరాలను నెటిజన్స్‌తో పంచుకుంటున్నారు. మరి, మంచు లక్ష్మికి ఈ అరుదైన గౌరవం లభించడంపై మీ అభిప్రాయం ఏమిటీ?