అన్వేషించండి

Manchu Vishnu: విమానంలో మంచు విష్ణుకు వింత అనుభవం, ‘ఇదేం జారుమిఠాయి రా బాబు’ అంటూ పోస్ట్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియా కు ఫ్లైట్ లో బయలు దేరారు. అయితే ఇండియాకు నేరుగా కాకుండా మధ్యలో లండన్ లో లే ఓవర్(ఇంకో విమానం మారడం) ఉంది. అందరరూ లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్ లో..

సాధారణంగా ప్రయాణాలు అంటే కొంత మందికి చాలా సరదా. కానీ కొంత మందికి ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంటాయి. మనం అనుకున్న టైమ్ కి మనం ఎక్కాల్సిన బస్సో, ట్రైనో రాకపోతే చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఇంకోసారి మనం సమయానికి వెళ్లినా ఏదొక సమస్య వచ్చి బయలుదేరడం ఆలస్యమైతే.. అప్పుడు వచ్చే ఇర్రిటేషన్ అంతా ఇంతా కాదు. కార్లు, బస్సులు, ట్రైన్ లే కాదు విమాన ప్రయాణాల్లో కూడా అప్పుడప్పుడూ ఇలాంటి ఇబ్బందులకు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా నటుడు మంచు విష్ణుకు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాను ప్రయాణించాల్సిన ఫ్లైట్ ఓ వక్తి అత్యుత్సాహం వలన ప్రయాణం ఆలస్యం అవ్వడంతో అది జరిగిన సందర్భాన్ని వివరిస్తూ ఇదేం ‘జారుమిఠాయి రా బాబు’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు మంచు విష్ణు. 

అసలేం జరిగిందంటే.. టాలీవుడ్ హీరో మంచు విష్ణు లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియా కు ఫ్లైట్ లో బయలు దేరారు. అయితే ఇండియాకు నేరుగా కాకుండా మధ్యలో లండన్ లో లే ఓవర్ (ఇంకో విమానం మారడం) ఉంది. అందరరూ లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కుతుండగా ఓ వక్తి హడావిడిగా వచ్చి వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్లి సిగిరెట్ తాగాడు. దీంతో తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయగా, విమానాశ్రయ సిబ్బంది వచ్చి అతన్ని కిందకు దించేశారు. అతని హ్యాండ్ లగేజీ కూడా లేకపోవడంతో అనుమానం వచ్చి మొత్తం ప్రయాణికుల్ని కిందకు దించి తనిఖీ చేసిన తర్వాత మళ్లీ లోపలికి అనుమతించారు. దీంతో మంచు విష్ణుకు ఆ వ్యక్తి పై చిర్రెత్తుకొచ్చిందట. ‘అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకుండా సిగరెట్ తాగడం ఏంటి, ఇదేం జారుమిఠాయి రా బాబు. ఇప్పుడు నేను లండన్ లో లే ఓవర్ ఫ్లైట్ కి అందుకోగలనో లేదో చూడాలి’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు మంచు విష్ణు. ఇది చూసి కొంత మంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచు విష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ అందుకున్నా గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన హిట్ పడలేదు. ఇటీవల ఆయన నటించిన ‘జిన్నా’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మంచు విష్ణు. అయితే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈసారి కూడా మంచి హిట్ అందుకోలేకపోయారు విష్ణు. అయితే ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో ఈ మూవీకు మంచి స్పందన వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. ఓటీటీలో కూడా సినిమాను చూడరు అనుకున్నారు. కానీ డిజిటల్ వేదికపై ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో కొన్ని రోజుల పాటు ఈ సినిమా ఇండియా లెవల్ లో ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఈ మూవీకు ఓటీటీ లో మంచి ఫలితాలే వచ్చాయి. తర్వలోనే ‘జిన్నా 2’ సినిమా కూడా ప్రారంభం కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

టాప్ హెడ్ లైన్స్

Vijayashanti : పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget