Mohanlal: మోహన్‌లాల్, రోషన్ ఒకే సినిమాలో - టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు హీరో రోషన్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రెడీ అవుతుంది. ఒకప్పటి ప్రముఖ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకే సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ అని తెలుస్తోంది. కన్నడ దర్శకుడు నంద కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘పొగరు’ సినిమాకు ఈయనే దర్శకుడు.
తండ్రీ కొడుకుల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. జులై నెలలోనే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మలయాళ సూపర్ స్టార్, కన్నడ డైరెక్టర్, తెలుగు హీరో నటిస్తున్నారు కాబట్టి దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదు.
అలాగే ప్రతిష్టాత్మక స్వప్న సినిమాస్ బ్యానర్‌లో కూడా రోషన్ హీరోగా నటించనున్నారు. కొత్త దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాకు ‘ఛాంపియన్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో రోషన్ తన లైనప్‌లో క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు.
2021లో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కూడా అదే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ‘పెళ్లి సందD’ తర్వాత కెరీర్‌లో గ్యాప్ వచ్చినా ప్రామిసింగ్ సబ్జెక్టులతో జోరు పెంచాడు.
2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమాలో రోషన్ బాలనటుడిగా కనిపించాడు. ఆ తర్వాత ‘నిర్మలా కాన్వెంట్’ (2016) అనే స్కూల్ మూవీలో నటించాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డును కూడా గెలుచుకున్నాడు.
తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పెళ్లి సందD’లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాలోని పాటలు, డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆశించిన విజయం మాత్రం సాధించలేదు. రోషన్ నటనలో ప్రవేశించడానికి ముందు నటనలో శిక్షణ పొందాడు. బాలీవుడ్‌లో కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేయడం విశేషం. ‘సీతారామం’ మూవీతో ఇప్పటికే వైజయంతి మూవీస్ మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోషన్ ‘ఛాంపియన్’ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Here's wishing our 'Champ' #Roshann a very Happy Birthday.#Champion @PradeepAdvaitam @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/E46ztppLf9
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2023
View this post on Instagram
Also Read : విస్కీ పూరితో వెరైటీ మాస్ ఇంట్రో - శివన్న కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial