అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata First Look: మహేష్ బాబు స్టైలిష్ లుక్.. సూపర్ స్టార్ ఫస్ట్ నోటీస్ ఇంపాక్ట్
ఇప్పటివరకు 'సర్కారు వారి పాట' సినిమా ప్రీలుక్స్ తో హడావిడి చేసిన చిత్రబృందం తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడగా.. ఇటీవలే తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఈ సినిమా ప్రీలుక్స్ తో హడావిడి చేసిన చిత్రబృందం తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు లగ్జరీ కారు డోర్ ఓపెన్ చేసి కాలు బయటపెట్టి స్టైల్ గా కనిపిస్తున్నారు. ఆ కారు గ్లాస్ విరిగిపోయి ఉండడం చూస్తుంటే.. ఇది యాక్షన్ సీన్ కి సంబంధించిన సీన్ అని తెలుస్తోంది.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌తో సంక్రాంతికి మిమ్మల్ని కలవబోతున్నామంటూ మహేష్ బాబు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. 2022 జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా చెప్పారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో మహేష్ ని చూద్దామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇప్పుడు మహేష్ లుక్ చూసి పండగ చేసుకుంటున్నారు. ఇండియా వైడ్‌గా ట్విట్టర్ లో #SarkaruVaariPaata, #SVPFirstNotice ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు.
కీర్తి సురేష్(Keerthi Suresh) హీరోయిన్‌గా నటిస్తోన్న తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను ‘సరిగమ సౌత్’ సంస్థ సొంతం చేసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీనికోసం సదరు సంస్థ ఏకంగా నాలుగున్నర కోట్లు చెల్లించినట్లు సమాచారం. గతంలో మహేష్ బాబు-తమన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ కావడంతో ఈ రేంజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
మొదటి నుండి కూడా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని చెబుతూనే ఉన్నారు. ఫైనల్ గా ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్.. అలానే ప్రభాస్ 'రాధేశ్యామ్'(RadheShyam) సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాల మధ్యలో అనీల్ రావిపూడి 'ఎఫ్ 3' విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ మీద దాడికి దిగితే కలెక్షన్ల పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion