News
News
వీడియోలు ఆటలు
X

Mahesh Babu: దుబాయ్‌లో ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేశ్ బాబు?

తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు.. దుబాయ్ లో ఓ ఖరీదైన, విలాసవంతమైన విల్లా కొనుగోలు చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

Mahesh Babu : సూపర్ మహేష్ బాబు విదేశీ టూర్లు గురించి మనకు తెలిసిందే. కొంచెం గ్యాప్ దొరికినా ఆయన విదేశాలకు చెక్కేస్తారు. ఇప్పుడు కూడా ఆయన పిల్లలతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఆయన గురించి ఓ బజ్ వైరల్ అవుతోంది. మహేష్ దుబాయ్‌లో ఏకంగా ఓ ఖరీదైన విల్లాను కొనేశారని, ఇకపై ఆయన ఖాళీ దొరికితే అక్కడే ఫ్యామిలీతో గడపనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మహేశ్ బాబు గానీ, ఆయన కుటుంబసభ్యులు, ఆయన సన్నిహితులు గానీ ధృవీకరించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చ నడుస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు దుబాయ్‌లోని సముద్ర తీర ప్రాంతంలో ఒక ప్రముఖ బిల్డర్ నుంచి ఓ అద్భుతమైన విల్లాను కొనుగోలు చేశారట. ఈ విల్లా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మహేష్ బాబు దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం. దీనికి రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విల్లా ఖరీదు ఎంతనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. విల్లా ఉన్న ప్రాంతం, బిల్డర్ కు ఉన్న పాపులారిటీని బట్టి చూస్తే మహేశ్ బాబు.. ఈ విల్లా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 

భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన స్టార్ హీరోస్ ఇండియాలోని వివిధ ఆస్తులపై పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సాధారణమే. కానీ విదేశాల్లోని ఆస్తులపై పెట్టుబడి పెట్టడం అనేది ఇటీవల ట్రెండవ్వుతోన్న సరికొత్త సంప్రదాయం. హిందీ, మలయాళ నటీనటులు ఇప్పటికే దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కొందరు క్రీడాకారులు కూడా అక్కడ కోట్లు విలువ చేసే విల్లాలను కొనుగోలు చేశారు. చెప్పాలంటే.. మన ఇండియాలో ప్రతి సెలబ్రిటీ అక్కడ ఏదో ఒక చోట ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నటీనటులతో పోల్చితే.. టాలీవుడ్ నుంచి దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీలు చాలా తక్కువే. అందుకే, మహేష్ బాబుకు అక్కడ విల్లాను కొనుగోలు చేస్తున్నరనే సమాచారం అంతగా వైరల్ అవుతోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో మహేష్ బాబు ఒకరు. అంతే కాదు ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను మూటగట్టుకున్న ఆయన.. విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇటీవలే ఆయన నటించిన 'సర్కారు వారి పాట' ఘనవిజయం సాధించగా.. ప్రస్తుతం డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది అతని మునుపటి రెమ్యూనరేషన్ కన్నా రూ. 50 కోట్లు ఎక్కువ అని సమాచారం.

ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజా సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. 

Read Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!

Published at : 01 May 2023 07:05 PM (IST) Tags: Mahesh Babu tollywood movies Trivikram Dubai villa

సంబంధిత కథనాలు

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

Ram Sita Ram Song: ఆహా ఎంత అద్భుతం! ఆకట్టుకుంటున్న‘ఆదిపురుష్‌’ ‘రామ్ సీతా రామ్’ సాంగ్

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

HanuMan Movie: ‘హనుమాన్‘ చిత్రంలో 1600 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ - మరి రిలీజ్?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!