Mahadev Betting App Case: ఇవాళ ఈడీ ముందుకు శ్రద్ధాకపూర్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఉచ్చు పలువురు బాలీవుడ్ స్టార్స్ మెడకు చుట్టుకుంటోంది. నటి శ్రద్ధాకపూర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానుంది. అటు రణబీర్ కపూర్ ఓ వారం తర్వాత విచారణకు వస్తానని చెప్పారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు పలువురు బాలీవుడ్ స్టార్స్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ కేసులో పలువురు బాలీవుడ్ స్టార్స్ పేర్లు విపిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసు విచారణ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈడీ ముందుకు వెళ్లనుంది. ఈ కేసులో తన ఇన్వాల్వ్ మెంట్ పై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నిన్న(గురువారం) హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను వారం రోజుల తర్వాత ఎంక్వయిరీకి వస్తానని చెప్పారు. ఈ మేరకు ఈడీ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కమెడియన్ కపిల్ శర్మ, నటి హుమా ఖురేషీ, శ్రద్ధా కపూర్ కు సమన్లు జారీ అయ్యాయి. ఒక్కొక్కరిని ఒక్కో రోజు విచారణకు రావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం వీరి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.
ఈ కేసులో సెలబ్రిటీల పాత్ర ఏంటి?
వాస్తవానికి పలువరు బాలీవుడ్ సెలబ్రిటీలు మహదేవ్ బెట్టింగ్ యాప్ కోసం కొంతకాలం పాటు ప్రచారం చేశారు. ఈ యాప్ కు సంబంధించిన యాడ్స్ లో నటించారు. ఈ యాప్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది. ఈ యాప్ ప్రమోటర్లు వారికి చేసిన చెల్లింపుల వ్యవహారంపైనా ఆరా తీస్తోంది. పలువురు సెలబ్రిటీల ఈ ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి, అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి భారీగా డబ్బు తీసుకున్నారనేది ఈడీ అభియోగం. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. వీరికి కూడా త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా ముగ్గురు నటులకు సమన్లు ఇచ్చింది. యూఏఈ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ బెట్టింగ్ యాప్ ద్వారా.. ప్రమోటర్లు సౌరభ్ చంద్రార్కర్, రవి ఉప్పల్.. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ కొద్ది రోజులుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సెలబ్రిటీలు
మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా మనీలాండరింగ్ జరుగుతున్నట్లు ఈడీ న్యాయవాది సౌరభ్ పాండే వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుపై విచారణ వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. రాయ్ పూర్ ఈడీ కార్యాలయం వేదికగా ఈ విచారణ జరుగుతుందన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చినట్లు చెప్పారు. వారిలో కొంత మందికి సమన్లు జారీ చేశామన్నారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కు సైతం మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 50 కింద సమన్లు ఇష్యూ చేసినట్లు వివరించారు. అయితే, తాను షూటింగ్ లో ఉన్న కారణంగా వారం రోజులు సమయం కావాలని కోరినట్లు చెప్పారు.
View this post on Instagram
Read Also: 'మ్యాడ్' రివ్యూ : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా ఎలా ఉందంటే? నవ్వించారా? లేదా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial