News
News
వీడియోలు ఆటలు
X

'Maha Samudram' Song: హే తికమక మొదలే.. నచ్చి నచ్చి పిచ్చి పట్టి .. 'మహా సముద్రం' లో విహరిస్తున్న ప్రేమ పక్షులు

'మహా సముద్రం' నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ , టీజర్, పాటలు, ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా విడుదలైన 'హే తికమక మొదలే' సాంగ్ యూ ట్యూబ్ లో దుమ్ములేపుతోంది..

FOLLOW US: 
Share:

Rx 100 లాంటి సెన్సేషనల్ హిట్ మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా  ''మహాసముద్రం''.  లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్ సినిమాలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా  అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా  అక్టోబర్ 14న విడుదల చేస్తున్నారు. టైం తక్కువ ఉండడంతో శరవేరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా తాజాగా విడుదల చేసిన పాట యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. 'హే తికమక మొదలే' పాటకు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చాడు. హరిచరణ్, నూతనా మోహన్ కలిసి పాడిన ఈ పాటకు  కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించాడు.

ఇప్పటికే విడుదలైన 'హే రంభా' పాట మాస్ ని మెప్పించింది

'చెప్పకే చెప్పకే' మెలోడీ క్లాస్ ని ఆకట్టుకుంది

లేటెస్టుగా వచ్చిన  'హే తికమక మొదలే.. ఎద సొద వినదే.. అనుకుందే తడువా.. ఇక నచ్చి నచ్చి పిచ్చి పట్టి..' అంటూ సాగిన  ఈ పాట  క్లాస్ అండ్ మాస్ ని మిక్స్ చేసి మెప్పించేస్తోంది.  రెండు ప్రధాన జంటల ప్రేమ కథలను తెలియజెప్పడమే ఈ సాంగ్ ప్రత్యేకత. శర్వానంద్-అను ఇమ్మాన్యుయేల్, సిద్ధార్థ్-అదితి రావు హైదరి జోడీలు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నట్లు చూపించారు. పోస్టర్స్, సాంగ్స్ చూస్చుంటే వీరి మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరినట్టు అనిపిస్తోంది.

'మహా సముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్, కేజీయఫ్ గరుడ రామ్, శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ దశమి బరిలో నిలుస్తున్న ఈ చిత్రం శర్వానంద్-సిద్దార్థ్ కి ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

Also Read: పెళ్లికాకుండానే తల్లైన సిరి హన్మంత్‌.. ఇదిగో బాబుతో ఉన్న ఫొటో..

Also Read: అండర్‌వేర్‌ను అలా చూసి అడ్డంగా బుక్కైన రష్మిక.. ఆ ప్రకటనపై నెటిజనులు ఆగ్రహం

Also Read: సాయి ధరమ్ తేజ్.. ‘రిపబ్లిక్’ ఎలా ఉంది? ప్రేక్షకుల రివ్యూ ఇదే..

Also Read: సూర్య కిరీటమే నీవా..క్యూట్ లుక్ లో మైమరపిస్తున్న శ్రియా శరణ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Oct 2021 01:31 PM (IST) Tags: Siddharth Aditi Rao Hydari Maha Samudram Song AnuEmmanuel 'Maha Samudram' 'Hey Thikamaka Modale' Lyrical Lyrical Video Out

సంబంధిత కథనాలు

ఉరుకుల పరుగుల ముంబై నగరంలో విజయ్ సేతుపతి - ట్రైలర్ చూశారా?

ఉరుకుల పరుగుల ముంబై నగరంలో విజయ్ సేతుపతి - ట్రైలర్ చూశారా?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

నా కూతురు అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్, ఆయనొస్తే నాకు చెప్పండి - మలయాళం హీరో టోవినో థామస్

నా కూతురు అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్, ఆయనొస్తే నాకు చెప్పండి - మలయాళం హీరో టోవినో థామస్

The India House Movie : నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?

The India House Movie : నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?

NTR 100th Birth Anniversary: తెలుగు జాతికి ఘనకీర్తి తెచ్చిన మహనీయుడు, కారణజన్ముడు- ఎన్టీఆర్ ను స్మరించుకున్న సినీ ప్రముఖులు

NTR 100th Birth Anniversary: తెలుగు జాతికి ఘనకీర్తి తెచ్చిన మహనీయుడు, కారణజన్ముడు- ఎన్టీఆర్ ను స్మరించుకున్న సినీ ప్రముఖులు

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

New Parliament Opening:  కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!

CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్‌ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్‌, నెగెటివ్స్‌ ఇవే!