అన్వేషించండి
Macherla Niyojakavargam: కలెక్టర్ సాబ్ కాస్త లేట్ గా వస్తాడట - 'మాచర్ల నియోజకవర్గం' కొత్త రిలీజ్ డేట్
'మాచర్ల నియోజకవర్గం' సినిమా రిలీజ్ డేట్ మారింది.

'మాచర్ల నియోజకవర్గం' రిలీజ్ డేట్
గతేడాది 'చెక్', 'రంగ్ దే', 'మ్యాస్ట్రో' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. గుంటూరు కలెక్టర్‌గా హీరో కనిపించనున్నారు. సినిమాలో హీరో పేరు ఎన్. సిద్దార్థ్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, చిన్న టీజర్ ను విడుదల చేశారు. అలానే జూలై 8న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. ఆగస్టు 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ యువ కలెక్టర్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది కథాంశంగా తెలుస్తోంది. పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో కూడిన కథలో నితిన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు.
ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటివరకు ఆయన ఎడిటర్ గా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఈ సినిమాలో కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నితిన్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' సినిమాలకు పని చేశారు.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















