Anjali Item Song: ‘రా.. రా.. రెడ్డి’ అంటూ దుమ్ములేపుతున్న అంజలి- ‘మాచర్ల నియోజకవర్గం’ సాంగ్ ప్రోమో విడుదల
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో అంజలి ప్రత్యేకమైన పాట
‘రా రా రెడ్డి.. అ యామ్ రెడి’ అంటుంది అంజలి. నితిన్ కథా నాయకుడిగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో అంజలి ప్రత్యేకమైన పాట చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సాంగ్ కి సంబంధించి అంజలి పోస్టర్ ని రిలీజ్ చేశారు. హాట్ లుక్స్ తో ఉన్న అంజలి పోస్టర్ ఈ సాంగ్ పై అంచనాలని పెంచింది. తాజాగా దీనికి సంబంధించి సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. “రా.. రా.. రెడ్డి.. అ యామ్ రెడీ” అంటూ నితిన్ తో కలిసి అంజలి అదిరిపోయే స్టెప్పులు వేసింది. జులై 9 న ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో విడుదల కానుంది. ఈ పాటలో అంజలి తన అందంతో కుర్రకారు మతి పోగొడుతుంది. ఊర మాస్ గెటప్ లో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
కాసర్ల శ్యామ్ ఈ పాటని రచించగా మహతి స్వర సాగర్ కంపోజ్ చేశారు. లిప్సిక అద్భుతంగా పాడింది. నితిన్ సరసన కృతి శెట్టి, క్యాథరిన్ థెరిస్సా నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. రాజకీయ కథా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నారు. ఆగస్ట్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంజలికి ఇది రెండో స్పెషల్ సాంగ్. గతంలో ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
View this post on Instagram
Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?
Also Read : నాయకుడు అధికారాన్ని కోరుకోవడం కాదు, నాయకుడినే అధికారం వెతుక్కుంటూ రావాలి - ‘పరంపర సీజన్ 2’ ట్రైలర్ అదుర్స్!