MAA Elections: మా ఎన్నికల సందడి.. ప్యానెల్‌తో మంచు విష్ణు మంతనాలు.. రేపు కీలక ప్రకటన
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల అంశం గత కొంతకాలంలో హాట్ టాపిక్ అవుతోంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల అంశం గత కొంతకాలంలో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల వాతావరం వేడెక్కింది. అక్టోబర్ 10న జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే హడావిడి మొదలైపోయింది. ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులను సెప్టెంబర్ 23న ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
Also Read:లహరి-శ్రీరామ్ లకు పెళ్లి చేసిన హౌస్ మేట్స్.. ప్రియాకు బ్యాడ్ న్యూస్..
ఈ మేరకు తన ప్యానెల్ తో కలిసి మంతనాలు జరుపుతోన్న ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. తన ప్యానెల్ ను అనౌన్స్ చేసే విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని.. రేపు ఉదయం 11గంటలకు సభ్యులను అనౌన్స్ చేయనున్నట్లు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ ఫొటోలో బాబు మోహన్, నరేష్ కనిపిస్తున్నారు. అలానే కొందరు సీనియర్ ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మంచు విష్ణు ప్యానెల్ లో.. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు ఉండనున్నట్లు సమాచారం. రేపు ఈ విషయంపై క్లారిటీ రానుంది.
'మా'కి ప్రత్యేక భవనం ఎజెండాతో మంచు విష్ణు రాబోతున్నారు. మరోపక్క జనరల్ సెక్రటరీ పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత పోటీ పడుతుండగా.. బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
Quite an interesting meeting with my MAA panel! Can’t wait to announce, tomorrow 11am my wonderful and interesting MAA Panel. pic.twitter.com/eSrEYj1eoQ
— Vishnu Manchu (@iVishnuManchu) September 22, 2021
Also Read: 'అబ్బాయిలతో మాట్లాడితే తేడాగా చూస్తావ్.. బాడీ షేమింగ్ చేస్తావ్..' ప్రియాపై హమీద ఫైర్..
Also Read: 'లైగర్' సెట్స్ లో బాలయ్య.. 'జై' కొట్టిన విజయ్ దేవరకొండ..
Also Read: కాజల్ మెస్మరైజింగ్ లుక్.. ఫోటోషూట్ తో రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి