X
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 19 - 26 Oct 2021, Tue up next
PAK
vs
NZ
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

MAA Elections 2021 Votes: ‘మా’ ఎన్నికల్లో రికార్డ్.. గతం కంటే పెరిగిన ఓటింగ్.. మొదలైన కౌంటింగ్

MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభించారు.

FOLLOW US: 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 3 గంటలకు ముగిసాయి. వాస్తవానికి ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకే ముగియాలి. కానీ, రిగ్గింగ్ ఆరోపణలు రావడంతో సుమారు గంటసేపు పోలింగ్ ఆపేశారు. కొంతమంది తారలు విమానాల్లో వస్తున్నారని, చేరుకోడానికి ఆలస్యమవుతుందని చెప్పడంతో 3 గంటల వరకు సమయాన్ని పొడిగించారు. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో మధ్యాహ్నం 3.30 నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. 


ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్లు పోలైనట్లు తెలిసింది. ‘మా’లో మొత్తం 905 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883 మందికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది. మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఆదివారం పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 605 ఓట్లు పోలయ్యాయి. వీటిని కలుపుకుంటే.. మొత్తం 665 ఓట్ల పడినట్లు లెక్క. గతంతో పోల్చితే.. ఈ సారి పోలింగ్ ఘననీయంగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 472 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అప్పట్లో అధ్యక్షుడిగా బరిలోకి దిగిన నరేష్‌కు 268 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. దీంతో నరేష్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.


కనిపించని స్టార్ హీరోలు: ఈ ఎన్నికలకు పలువురు స్టార్ హీరోలు దూరంగా ఉన్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్‌తోపాటు నితిన్ నాగచైతన్య, రానా తదితర హీరోలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాలేదు. ఇలియానా, అనుష్క రకుల్, హన్సిక, త్రిష తదితరులు కూడా ఓటు వేయలేదు. షూటింగులో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసినట్లు తెలిసింది. 


ఇదీ మా చరిత్ర: తమిళనాడు నుంచి తెలుగు నేలపై అడుగుపెట్టిన సినీ రంగం కొన్నాళ్లు పెద్ద మనుషులు లేకుండానే సాగింది. టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క వేదిక కూడా ఉండేది కాదు. తమ మొరను వినే పెద్ద దిక్కు లేదా అంటూ కళాకారులు కుమిలిపోతున్న రోజుల్లో.. నేనున్నా అంటూ పుట్టిందే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) పుట్టింది. ఒకప్పుడు హూందాగా మొదలైన సేవలు.. ఆ తర్వాత లుకలుకలతో అంతర్గత కలహాలతో వర్గాలుగా విడిపోయారు. అయితే, ఇన్నాళ్లూ ఇంట్లోనే కొట్టుకున్న సభ్యులు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. పంతాలు, ఆదిపత్యం కోసం ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్నారు.


పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సాయం చేసేందుకు 1993లో తెలుగు తారలంతా విశాఖపట్నంలో క్రికెట్ ఆడి నిధులు సమకూర్చారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తిరిగివస్తున్న సమయంలో చిరంజీవి, మురళీ మోహన్‌లకు మూవీ ఆర్టిస్టుల సమస్యలను తీర్చేందుకు ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీనియర్ నటులతో చర్చించి.. ‘మా’కు జీవం పోశారు. 1993, అక్టోబరు 4వ తేదీన ‘మా’ అసోసియేషన్ ఏర్పాటైంది. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజులను ముఖ్య సలహాదారులుగా ఎంపిక చేశారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో ‘మా’ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 


Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!


Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: mohan babu Manchu Vishnu Prakash raj Maa Elections 2021 మా ఎన్నికలు 2021 మా ఎన్నికలు Manchu Vishnu Panel మంచు విష్ణు Prakash Raj Panel ప్రకాష్ రాజ్ MAA elections Result MAA Poling MAA votes MAA Elections Counting

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చదవకుండా మిస్సైన లెటర్స్ ఇవే...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చదవకుండా మిస్సైన లెటర్స్ ఇవే...

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?

Bigg Boss 5 Telugu: ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss 5 Telugu: ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Puri Jagannadh: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?

Puri Jagannadh: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?

Vijay Deverakonda's Liger: రౌడీ అండ్ పూరి... ప్లానింగ్ ఫర్ సమ్మర్!

Vijay Deverakonda's Liger: రౌడీ అండ్ పూరి... ప్లానింగ్ ఫర్ సమ్మర్!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Breaking News Live Updates: దిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Bhutan Culture: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?

PornHub: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. పోర్న్ హబ్ లో పాఠాలు.. ఎంత సంపాదిస్తాడో తెలుసా?