అన్వేషించండి

Love Me Release Date: ‘లవ్ మీ’ నుంచి క్రేజీ అప్ డేట్ - దెయ్యంతో ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?

దిల్ రాజు సోదరిడి కుమారుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మీ‘. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు.

Love Me Release Date Announced: యువ హీరో ఆశిష్, 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ‘. దర్శకుడు అరుణ్ భీమవరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

ఏప్రిల్ 25న ‘లవ్ మీ‘ విడుదల

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు. ఏప్రిల్ 25న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రేమగా హగ్ చేసుకున్నారు. ఈ ప్రకటనతో సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కూడా ‘బేబీ‘ మాదిరిగానే మంచి సక్సెస్ అందుకుంటుందని ఆకాంక్షిస్తున్నారు.  

ఈ సినిమా ‘ఆర్య’ లాగే సక్సెస్ అవుతుంది - దిల్ రాజు

ఇక రీసెంట్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కథను విన్నప్పుడు ‘ఆర్య’ సినిమా స్టోరీ గుర్తుకు వచ్చినట్లు చెప్పారు. “లవ్ మీ’ సినిమా కథ వినగానే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. ఆర్య కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో... మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం. ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు నమ్మకంగా ఉంది. నాకు ఆర్య విషయంలో ఏం జరిగిందో.. మీ అందరికీ అదే జరగబోతోందనే వైబ్స్ వస్తున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

ఏప్రిల్ లో దిల్ రాజు బ్యానర్ నుంచి 2 సినిమాలు విడుదల

‘లవ్ మీ’ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు రెడీ అవుతుండగా, ఏప్రిల్ 5న దిల్ రాజు నిర్మాణం అవుతున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకులు ముందుకు రానుంది. ఒకే నెలలో దిల్ రాజు బ్యానర్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.  

Read Also: అక్కడ రాజు, ఇక్కడ బానిస- ‘ది గోట్ లైఫ్’ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget