Liger Movie Collections Day 1: ‘లైగర్’ను సేవ్ చేసిన ప్రమోషన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్‌తో రిలీఫ్ - అసలు ఫైట్ ముందుంది!
పాన్ ఇండియా సినిమాగా విడుదలైన లైగర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ సైతం ఆశించిన స్థాయిలో రాలేదు.
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన తాజాగా సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యింది. భారీ ప్రమోషన్స్ కారణంగా సినిమా ఓ రేంజిలో ఉంటుందని ఊహించిన సినీ అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అదుకోలేకపోయింది. అధికారిక ప్రకటన ప్రకారం ‘లైగర్’ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 33.12 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. లైగర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఊహించిన దానికంటే చాలా తక్కువగా వసూళ్లు వచ్చాయి. సుమారు రెండు సంవత్సరాల తర్వాత విజయ్ మూవీ జనాల్లోకి రావడం, పెద్ద ఎత్తున చేసిన ప్రమోషన్ల మూలంగా అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి. అందుకు అనుగుణంగానే తొలి రోజు సుమారు రూ. 15 కోట్లు వసూళు చేసే అవకాశం ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ, తొలి షో నుంచే సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేకపోయాయి.
తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి 9.57 కోట్ల షేర్ ను మాత్రమే సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. నైజాంలో అత్యధికంగా రూ.4.24 కోట్ల కలెక్షన్స్ సాధించింది. సీడెడ్ లో రూ.1.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.27 కోట్లు వసూళ్లు వచ్చాయి. గుంటూర్ లో రూ.83 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.39 లక్షలు, నెల్లూరులో రూ.40 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ.15.40 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.9.57 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్ సీస్ లో తొలి రోజు ఈ సినిమాకు రూ.2.56 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
ఇక అనుకున్న అంచనాలను అందుకోకపోయినా.. తాజాగా విడుదలైన సినిమాల్లో లైగర్ మాత్రమే తొలిరోజు ఎక్కువ వసూళ్లను సాధించింది. మిడ్ రేంజ్ హీరోల్లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా లైగర్ గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా బాగా నిరాశ పరిచింది. దానికి అనేక కారణాలున్నాయి. లైగర్ నిర్మాతగా ఉన్న కరణ్ జోహార్ చుట్టూ విమర్శలు కొనసాగుతున్నాయి. పైగా బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెంట్ కొనసాగుతుంది. సినిమాకు ముందు విజయ్ దేవరకొండ సైతం సినీ అభిమానులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాలీవుడ్ లో లైగర్ బోల్తా కొట్టిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా తొలి రోజు రూ. 35 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందని అంచనా. ఇతర ట్రేడ్ పండితులు సైతం సుమారు ఇదే అంచనా వేశారు. దాదాపు అంతవరకు కలెక్షన్లు వచ్చినా, ఆశించిన మొత్తం కంటే తక్కువే. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు ‘లైగర్’ టీమ్ చేసిన ప్రమోషన్స్ తొలి రోజు వసూళ్లకు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. కానీ, నెగటివ్ టాక్ వల్ల మిగతా రోజుల్లో ఎంత వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
View this post on Instagram
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా లైగర్ తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ కి జంటగా అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. రమ్య కృష్ణ కీరోల్ పోషించారు. విజయ్ హిందీలో తొలిసారి అడుగు పెట్టనున్న నేపథ్యంలో విపరీతమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. అయినా హిందీ ప్రేక్షకులను ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?