Dilip Kumar Passes Away: : ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్ ఇకలేరు!
లెజండరీ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యంతో కన్నుమూశారు.
లెజండరీ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ మధ్యకాలంలో దిలీప్ కుమార్ ను హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని హాస్పిటల్ లో చేరగా.. ఊపిరితిత్తులో చేరిన నీటిని తొలగించే ప్రొసీజర్ ను నిర్వహించారు. కానీ మళ్లీ ఆయన అస్వస్ధతకు గురికావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. గతేడాదిలోనే దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్‌లు కరోనా ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాదం నుండి కోలుకోకముందే దిలీప్ కుమార్ మరణించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
1992 డిసెంబర్ 11న పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు దిలీప్ కుమార్. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు దిలీప్ తన తండ్రితో కలిసి పండ్లు అమ్మేవారు. ఆ తరువాత 1944లో 'జ్వర భాతా' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని నామకరణం చేశారు.