By: ABP Desam | Updated at : 06 Feb 2022 12:25 PM (IST)
బాలకృష్ణ
గానకోకిల లతా మంగేష్కర్ మరణం సినీ లోకాన్ని ఆవేదనలో ముంచింది. పలువురు ప్రముఖులు ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో బాలకృష్ణ లతా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో దేశం గర్వించదగ్గ గాయని లతా అని కొనియాడారు. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు అని పొగిడారు. ఆమె పొందని అవార్డు, రికార్డులు కూడా లేవని చెప్పారు. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే ఇలా మన దేశంలోని ఉన్నత అవార్డులన్నీ ఆమె సాధించిందని, విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలను ఇచ్చి గౌరవించాయని అన్నారు. 70 ఏళ్లలో 30కి పైగా భాషల్లో 30 వేల పాటలు పాడడం సాధారణ విషయం కాదని అన్నారు. ఆమె మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని అభిప్రాయపడ్డారు బాలయ్య. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read: లతా దీదీ మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నా.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
తన అధ్భుతమైన గాత్రంతో దేశప్రజలను అలరించిన లతా ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆమె కరోనా వైరస్ బారిన పడడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు వారాలుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. మధ్యలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లతా బాగానే ఉన్నారని చెప్పారు, కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు వైద్యులు. మళ్లీ రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించింది. దీంతో ఆదివారం ఉదయం మరణించారు.
Also Read: లతా మంగేష్కర్ సాంగ్స్, ముప్పై వేల పాటల్లో తెలుగు పాటలు ఎన్నో తెలుసా?
లతా హిందీ, మరాఠీ భాషల్లోనే అధికంగా పాడారు. తెలుగులో పాడినవి మూడే పాటలు అయినా ఆమెకు ఇక్కడ అభిమానులు ఎక్కువే. ఆమె పాడిన ఎన్నో హిందీ పాటలు ఇప్పటికీ తెలుగు వారిలో నోళ్లలో నానుతూనే ఉంటాయి. 1942 నుంచి 2015 దాకా విరామం తీసుకోకుండా ఆవిడ పాడుతూనే ఉన్నారు. 1990లో ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందింది. ఏఎన్నార్, ఎన్టీఆర్, నాగార్జున సినిమాల్లో ఆమె పాడారు. వాటిలో బాగా ఫేమస్ అయినా పాట ‘నిదుర పోరా తమ్ముడా’ అనే సాంగ్. 1955లో పాడిన పాట ఇది.
Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?
‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?