Krishna Mukunda Murari May 20th: ముకుందని పుట్టింటికి పంపించేందుకు రేవతి ప్రయత్నం- కృష్ణ, మురారీ క్యూట్ రొమాన్స్
మురారీ మీద కృష్ణకి ప్రేమ మొదలుకావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Krishna Mukunda Murari May 20th: ముకుందని పుట్టింటికి పంపించేందుకు రేవతి ప్రయత్నం- కృష్ణ, మురారీ క్యూట్ రొమాన్స్ Krishna Mukunda Murari Serial May 20th Episode 162 Written update Today Episode Krishna Mukunda Murari May 20th: ముకుందని పుట్టింటికి పంపించేందుకు రేవతి ప్రయత్నం- కృష్ణ, మురారీ క్యూట్ రొమాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/2a9b0dba8025e63754b6b5800e626b8c1684552449519521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మురారీ డల్ గా ఉన్నాడని కృష్ణ తన మూడ్ మార్చేందుకు ట్రై చేస్తుంది. గదిలో కృష్ణ ఫోటోస్ తో డెకరేట్ చేసి లైటింగ్ పెడుతుంది. కృష్ణ తన తింగరి ఫోటోస్ అన్నింటినీ చూసి మురారీ పగలబడి నవ్వుతాడు. మీరు ఇలా నవ్వి ఎంత కాలం అయ్యింది ఇక ముందు మీరు ఇలా ఉండటానికి వీల్లేదు మీ మూడ్ బాగోలేనప్పుడు వీటిని చూసి నవ్వుకొమ్మని చెప్తుంది. ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుకుంటారు. భవానీ అక్క ఇంట్లో లేకపోయే సరికి ముకుందలో తెగింపు పెరిగిపోయింది. నేను గమినిస్తున్నానని తెలిసేలా చేయాలి లేదంటే నా కొడుకు కాపురంలో చిచ్చు రేగేలా ఉందని రేవతి మనసులో అనుకుంటుంది. అప్పుడే ముకుంద వస్తుంది. ఉదయం మీ నాన్న మాట్లాడిన దాంట్లో తప్పేమీ అనిపించలేదు . నువ్వు ఇక్కడ ఉంటే మీ నాన్నకి మనశ్శాంతి లేదు. ఆదర్శ్ వస్తాడని మా అందరి నమ్మకం. వాడు తిరిగి వచ్చేవరకు అయినా నువ్వు మీ పుట్టింట్లో మీ నాన్న కళ్ళ ముందు ఉంటే మనశ్శాంతిగా ఉంటుందని నా అభిప్రాయమని చెప్తుంది.
Also Read: ఢీ అంటే ఢీ అంటున్న ముకుంద, మురారీ- రోజురోజుకీ భర్తకి మరింత దగ్గరవుతున్న కృష్ణ
మీరు ఎప్పుడెప్పుడు పుట్టింటికి పంపించేద్దామా అని ఎదురుచూస్తున్నారని నాకు తెలుసని ముకుంద మనసులో అనుకుంటుంది. ఎక్కడికి వెళ్ళను ఆదర్శ్ తిరిగి వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉంటానని చెప్పేస్తుంది. ముకుంద ఇంట్లోఉంటే ఏం జరుగుతుందోనని భయపడుతుంది. ఈశ్వర్ తాగాలని అనుకున్న మందు కాస్తా మధుకర్ లాగేసుకుని ఫుల్ కొట్టేస్తాడు. తనలో ఉన్న టాలెంట్ బయట పెడతానని ఇంట్లో పాము దూరింది అనేసరికి అందరూ బయటకి వస్తారు. సరదాగా మాట్లాడుకుంటారు. మధుకర్ కి మెమరీ టెస్ట్ పెడతానని కృష్ణ అంటుంది. ఒక ఆట ఆడతానని చెప్పి మధుకర్ ని కృష్ణ బకరా చేస్తుంది. అదంతా అలేఖ్య వీడియో తీస్తుంది. అది చూసి అందరూ పగలబడి నవ్వుకుంటారు. ఆ వీడియో మధుకర్ చూసి ఏడుస్తాడు. నన్ను మరీ ఫూల్ ని చేస్తావా అని ఏడుపు లంకించుకుంటాడు.
Also Read: అభిమన్యుని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన చిత్ర- వేద చెల్లి జీవితాన్ని కాపాడగలుగుతుందా?
మధుకర్ అలేఖ్య దగ్గరకి వెళ్ళి నీ రెండు చేతులకి గోరింటాకు ఉంది నాకు బొట్టు ఎలా పెడతావాని అడుగుతాడు. చేతులు కడుక్కుని పెడతానని చెప్తుంది. ఇదే ప్రశ్న ముకుందని అడుగుతాడు. బొట్టు పెట్టి పంపించడానికి ఆదర్శ్ లేడు కదా అని బాధపడుతుంది. ఆ మాటకి అందరూ బాధపడతారు. కృష్ణ నువ్వు బొట్టు ఎలా పెడతావాని అంటే తను వెళ్ళి మురారీ నుదుటి మీద తన నుదురు పెట్టి బొట్టు పెడుతుంది. అది చూసి ముకుంద కుళ్ళుకుంటుంది. తెల్లారి మురారీ డల్ గా ఉండటం చూసి ఏమైంది మళ్ళీ డల్ గా ఉన్నారని అడుగుతుంది. ఏమో తెలియదు నా గుండెకి తెలియాలని అంటాడు. అయితే మీ గుండెని అడుగుతానని గుండెల మీద వాలిపోతుంది. ఇది ప్రేమ లేదంటే అభిమానమా.. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే బాగుండు కృష్ణ అని మనసులో అనుకుంటాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)