Krishna Mukunda Murari June 29th: 'నేను నా భార్యని ప్రేమిస్తున్నా ముకుంద, నీ భర్తని నువ్వు ప్రేమించు' తెగేసి చెప్పిన మురారీ
కృష్ణని మురారీ ప్రేమిస్తున్నాడని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఫామ్ హౌస్ లో ఒక గది బయట అమ్మాయి చెప్పులు కనిపించాయని కృష్ణ చెప్పేసరికి నిజంగానే ముకుంద ఇక్కడికి వచ్చిందా ఏంటని మురారీ అనుమానపడతాడు. అవి రాజ్ నర్స్ వి అయి ఉంటాయని కవర్ చేస్తుంది. కొంపదీసి డైరీ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? అలాంటిది ఏమైనా ఉంటే ముందే చెప్పేస్తారు కదాని కృష్ణ మనసులో అనుకుంటుంది. తన మైండ్ డైవర్ట్ చేసేందుకు ఏవేవో చేస్తాడు. తర్వాత తనకి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఈ విషయం గురించి మురారీ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పులు చూశాను అంటుంది కృష్ణ కానీ మమ్మీ మాత్రం ఎవరూ ఉండరని అంటుంది. మనకి తెలియకుండా ఇక్కడ ఏమైనా జరుగుతుందా? లేకపోతే ముకుంద ఏమైనా వచ్చిందా అని అనుకుంటాడు. అప్పుడే రాజ్ నర్స్ వస్తే ఇక్కడ మనం కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా? అని నిలదీస్తాడు. ఎవరూ లేరని అబద్ధం చెప్తుంది. పైన రూమ్ ముందు ఎవరో అమ్మాయి చెప్పులు ఉన్నాయట కదా అంటే నిన్న ఒకరు భవానీ మేడమ్ తాలూకూ అని వచ్చారు. రాత్రంతా ఉండి ఉదయాన్నే వెళ్లిపోయారు ఆమె చెప్పులేమోనని అబద్ధం చెప్పి వెళ్ళిపోతుంది.
Also Read: ఆఫీసులో అందరి ముందు రాహుల్ కి రాజ్ వార్నింగ్- ఇంట్లో పంచాయతీ పెట్టిన రుద్రాణి
ఇదంతా అబద్ధంలాగే ఉంటుందని మురారీ కనిపెట్టేస్తాడు. అటు కృష్ణ కూడా దీని గురించే ఆలోచిస్తుంటే మురారీ వచ్చి పలకరిస్తాడు. ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వెళ్దామని మురారీ అనేసరికి ఇప్పుడా అంటుంది. సరే రేపు వెళ్దామని అంటే వామ్మో దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది. ఇక మరుసటి రోజు కృష్ణని పూల్ దగ్గరకి తీసుకెళ్ళి స్విమ్ చేద్దాం రమ్మని అంటాడు. తనకి ఈత రాదని చెప్తుంది. కాసేపు ఇద్దరూ మాట్లాడుకుని కృష్ణ మురారీని నీళ్ళలోకి తోసేస్తుంది. తనకి ఈత రాదని మురారీ కాసేపు హడావుడి చేసేసరికి కృష్ణ టెన్షన్ పడుతుంది. వచ్చి చెయ్యి అందిస్తే తనని నీళ్ళలోకి లాగేస్తాడు. కృష్ణ మునిగిపోతూ తనకి ఈత రాదని అరుస్తుంది. మురారీ తనని బయటకి తీస్తాడు. కృష్ణ నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేనని బాధపడతాడు. ఎంత లేపినా కూడా తను లేవకపోయే సరికి కంగారుపడతాడు. తనని ఎత్తుకుని వెళ్లబోతుంటే ముకుంద ఎదురుపడుతుంది.
Also Read: నీలాంబరి చేతిలో చావుదెబ్బ తిన్న అభిమన్యు- వేద, యష్ హనీ మూన్, ఉరి వేసుకోబోయిన మాళవిక
రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ముకుందతో మురారీ తన ప్రేమ విషయం చెప్పేస్తాడు. నేను నా భార్యని ప్రేమిస్తున్నా, నువ్వు కూడా నీ భర్తని ప్రేమించు అదే కరెక్ట్ అనేసరికి ముకుంద కళ్ళ నిండా నీళ్ళతో షాక్ అయి చూస్తూ ఉంటుంది. మురారీ ప్రేమ సంగతి ముందే తెలుసని ముకుంద బయట పెడితే ఇక ఇద్దరి మధ్య వార్ ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇప్పటికే ముకుంద ఎట్టి పరిస్థితుల్లోను మురారీని వదులుకునే ప్రసక్తే లేదని నిర్ణయించుకుంది.