Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ చూశారా?
కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా టీజర్ ను విడుదల చేశారు.
శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baga Kavalsinavadini Movie). కోడి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరో. సంజనా ఆనంద్ హీరోయిన్. కార్తీక్ శంకర్ రచన, దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఎంటర్టైనింగ్ గా టీజర్ ను కట్ చేశారు. ఇందులో హీరో కారు డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. తన మావయ్య(బాబా భాస్కర్) హెల్ప్ తీసుకొని ఓ అమ్మాయిని ప్రేమలో పడేయాలని చూస్తుంటారు హీరో. ఈ క్రమంలో అతడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా. 'ఏవరేజ్ గా ఉన్న అమ్మాయిల విలువ నాల కరువు లో ఉన్నవాడికి తెలుస్తాది గాని నీలా కడుపు నిండి పోయినవాడికి ఏం తెలుస్తాది' అంటూ హీరో చెప్పే డైలాగ్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. భాస్కరభట్ల పాటలు రాయగా... ప్రవీణ్ పూడి ఎడిటింగ్, రాజ్ కె. నల్లి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా ఏవరేజ్ గా ఆడింది. మరి 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!
Also Read : నాగార్జున ఊచకోత మామూలుగా లేదుగా - దసరాకు 'ఘోస్ట్'గా వస్తున్న కింగ్
Also Read : ముగింపు మన చేతుల్లో ఉండదు - 'సీతా రామం'లో సుమంత్ లుక్ చూశారా? మాట విన్నారా?
View this post on Instagram