![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Oh Bangaram Song : కిరణ్ అబ్బవరం ఆ ఎప్పుడూ ఆ విషయంలో తగ్గడుగా!
కిరణ్ అబ్బవరం హీరోగా 'బన్నీ' వాస్ నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది. తాజాగా రెండో పాట విడుదల చేశారు.
![Oh Bangaram Song : కిరణ్ అబ్బవరం ఆ ఎప్పుడూ ఆ విషయంలో తగ్గడుగా! Kiran Abbavaram never disappoints with songs Listen Vinaro Bhagyamu Vishnu Katha Second Lyrics Oh Bangaram Oh Bangaram Song : కిరణ్ అబ్బవరం ఆ ఎప్పుడూ ఆ విషయంలో తగ్గడుగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/20/50dabfaedaf45771c4fd7d90ac8e584c1674200602967313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కి మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి సినిమాలో సాంగ్స్ చార్ట్ బస్టర్లు అయ్యాయి. గీతా ఆర్ట్స్, జీఏ2 పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో కూడా సాంగ్స్ బావుంటాయి.
కిరణ్ అబ్బవరం హీరోగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). ఇందులోని 'వాసవ సుహాస...' సాంగ్ విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంస్కృత సాహిత్యంతో ఆ సాంగ్ సాగింది. ఇప్పుడు రెండో సాంగ్ 'బంగారం...' విడుదల చేశారు. ఈ పాట పెప్పీగా, ప్రతి అబ్బాయి తన ప్రేయసిని ఊహించుకుని పాడుకునేలా ఉంది.
''ఓ బంగారం నీ చెయ్యి తాకగానే...
ఉప్పొంగిపోయిందే నా ప్రాణం''
అనే ఈ పాటను భాస్కరభట్ల రచించారు.
"కాటుక కనులే...పుట్టిస్తుంటే కలలే!
వదిలెదెట్టేగా ఓ మైనా...
నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
దిల్ రుబా మోగిందే నాలోనా'' వంటి లైన్లు ఆకట్టుకున్నాయి. ఈ పాటను కపిల్ కపిలన్ పాడగా.... చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ మధ్య విడుదలైన 'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
''ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్?'' అని కిరణ్ అబ్బవరం చెప్పడం... స్క్రీన్ మీద కశ్మీర పర్ధేశీతో లవ్ సీన్స్ రావడం బావుంది. ఆ తర్వాత కామెడీ, థ్రిల్, కాన్సెప్ట్ అన్నీ ఉన్నాయని హీరో చెప్పారు.
Also Read : 'ఏటీఎం' వెబ్ సిరీస్ రివ్యూ : వీజే సన్నీ దొంగతనం సక్సెసా? ఫెయిలా? 'దిల్' రాజు ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?
''కాన్సెప్ట్ తో మొదలై... లవ్, కామెడీ మిక్స్ అయ్యి... క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోండి'' సినిమా గురించి కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు.
'వాసవ సుహాస...' ప్రారంభానికి ముందు హీరోకి, తాతకు మధ్య జరిగే సంభాషణ సినిమాలోని కథా సారాంశాన్ని తెలిపే విధంగా ఉంది. కనిపించే ప్రతివాడు మన పక్కింటి వాడేనని సందేశాన్ని సినిమాలో ఇస్తున్నారని అర్థమైంది. ''నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావ్ అన్నదాని బట్టే ఉంటుంది'' అని 'శుభలేఖ' సుధాకర్ చెప్పే మాట బావుంది. కనిపించే ప్రతి మనిషికి సాయం చేసే గుణం ఉన్న యువకుడిగా హీరో పాత్రను పాటలో పరిచయం చేశారు. కిరణ్ అబ్బవరం లుక్ కూడా పక్కింటి కుర్రాడిలా ఉంది.
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది. ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత: బాబు, సంగీతం: చైతన్ భరద్వాజ్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)