By: ABP Desam | Updated at : 13 Apr 2022 10:50 AM (IST)
'కేజీఎఫ్' డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్ విన్నారా?
'కేజీఎఫ్' సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ రావడంతో చాలా మంది హీరోలు ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన 'కేజీఎఫ్2' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది చిత్రబృందం. దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఆయన చేస్తోన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకు మద్యం తాగే అలవాటు ఉందని చెప్పారు ప్రశాంత్ నీల్. ఒక షరతుతో ఈ విషయాన్ని బయటపెట్టారాయన. ఆ షరతు ఏంటంటే.. ఇంటర్వ్యూలో తను చెప్పే ఈ కామెంట్స్ ను కట్ చేసి పక్కన పడేయమని తనకు మాటివ్వాలని అడిగాడు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు జనాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తాను మద్యం సేవిస్తానని.. మందు తాగుతూనే కథలు రాస్తుంటానని అన్నారు ప్రశాంత్ నీల్. మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో సన్నివేశాల గురించి ఆలోచన చూస్తుంటానని అన్నారు. కథ ముఖ్యం కాదని.. దాన్ని ఎలా ప్రెజంట్ చేశామనేదే ముఖ్యమని చెప్పుకొచ్చారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే
Experience #KGFChapter2 in @IMAX from April 14th worldwide.#KGF2onApr14@Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @bhuvangowda84 @RaviBasrur @VaaraahiCC @excelmovies @AAFilmsIndia @PrithvirajProd @DreamWarriorpic pic.twitter.com/mgPavB6Oa8
— Prashanth Neel (@prashanth_neel) April 6, 2022
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్స్టాప్?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్గా నిఖత్ జరీన్!
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం