News
News
X

Kerala Court: ‘కాంతార‘ లవర్స్‌కు గుడ్ న్యూస్, ఆ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన న్యాయస్థానం

‘కాంతార’ మూవీలోని వరాహ రూపం పాటపై నెలకొన్న వివాదానికి పుల్ స్టాఫ్ పడింది. ఈ పాట కాపీ రైట్స్ మీద దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది.

FOLLOW US: 

‘కాంతార’ సినిమా నిర్మాణ సంస్థకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాలోని వరాహ రూపం పాట మీద నెలకొన్న వివాదానికి న్యాయస్థానం ముగింపు పలికింది. ఈ పాట ట్యూన్ తమదేనంటూ తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ మేరకు వరహ రూపం పాట మీద ఉన్న బ్యాన్ ను న్యాయస్థానం ఎత్తివేసింది.  

ఆ పాట లేకుండానే ఓటీటీలో ‘కాంతార’ రిలీజ్

హొంబలే ఫిలింస్ నిర్మించిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. సుమారు రూ.16 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్ల రూపాయలను వసూళు చేసింది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. అయితే, థియేటర్ లో అద్భుతంగా అలరించిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం జనాలను అంతగా ఆకట్టుకోవడం లేదట. దానికి కారణం ఈ సినిమా వరాహ రూపం అనే పాట లేకపోవడం. దాని స్థానంలో అదే ట్యూన్‌లో మరో పాటను పెట్టారు.

వాస్తవానికి వరాహ రూపం పాటను రీప్లేస్ చేయడానికి కీలక కారణం ఉంది. తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ ఈ పాట ట్యూన్ తమదేనంటూ కోర్టును ఆశ్రయించింది. తమకు చెందిన నవరస అనే పాట నుంచే వరాహ రూపం పాటను కాపీ చేశారని వెల్లడించింది. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం తొలుత ఆ పాటపై బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణ సంస్థ ఈ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. అటు ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలోనూ ఆ పాటను తొలగించారు. మరో పాటతో ఈ పాటను రీప్లేస్ చేశారు.   

News Reels

వరాహ రూపం పాటపై బ్యాన్ ఎత్తివేత

మొత్తంగా గత కొద్ది రోజులుగా ఈ పాట వివాదం కోర్టులో నలుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసును కేరళ న్యాయస్థానం పరిశీలించింది. వరాహ రూపం పాటపై ఉన్న బ్యాన్ ను తొలగిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ఓటీటీలోనూ ఈ పాటను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఓటీటీలో ఈ పాట లేదని నిరాశ చెందిన ఫ్యాన్స్ ను న్యాయస్థానం గుడ్ న్యూస్ అందించిందని చెప్పుకోవచ్చు.

బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం

ఇక ‘కాంతార’ సినిమా ఓవరాల్ గా రూ. 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా, కర్నాటకలో రూ. 168 కోట్లు వసూళు చేసింది. తెలుగులో రూ. 60 కోట్లు వసూళు చేసింది. హిందీలో రూ. 96 కోట్లు సాధించింది. కేరళలో రూ. 19 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు సాధించింది.  

Read Also: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!

Published at : 25 Nov 2022 08:24 PM (IST) Tags: Kerala Court Kantara Movie Varaha Roopam Song

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !