Keerthy Suresh: మరోసారి మంచి మనసు చాటుకున్న కీర్తి సురేష్, ‘దసరా’ యూనిట్ కు ఖరీదైన కానుకలు
కీర్తి సురేష్ మరోసారి తన మంచి మనసును చాటుకుంది. ‘దసరా’ షూటింగ్ అనంతరం చిత్ర యూనిట్ కు ఊహించని కానుకలు ఇచ్చింది. ఆమె సర్ ప్రైజ్ పట్ల చిత్ర బృందం ఆశ్చర్యపోయింది.
‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తన అద్భుత నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇతర సినిమాల్లోనూ నటిస్తోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ అనే మూవీ చేస్తోంది. 90వ కాలం నాటి స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. షూటింగ్ చివరి రోజున కీర్తి సురేష్ సినిమా యూనిట్ కు సర్ప్రైజ్ గిప్టులు ఇచ్చింది.
‘దసరా’ యూనిట్ కు బంగారు నాణేలు
కీర్తి సురేష్ చిత్ర యూనిట్ కి బంగారు కానుకలు ఇచ్చి ఆశ్చర్య పరిచింది. ఈ మూవీ కోసం చేసిన 130 మందికి ఒక్కొక్కరికి 2 గ్రాములు బంగారు నాణేలను అందించింది. ఈ బంగారు నాణేల కోసం కీర్తి సురేష్ దాదాపు రూ. 13 లక్షలు ఖర్చు చేసిందట. బంగారు నాణేలు అందుకు చిత్ర బృందం సభ్యులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ బహుకరించిన బంగారు నాణేల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Thangamae @KeerthyOfficial 💙
— Meena Jo💙(Keerthy Girl) (@MeenaJo7) January 20, 2023
More respect on you 🙏
Love you always mam ❤ #KeerthySuresh #Meenajo pic.twitter.com/G7N6D0f1i0
రఫ్ లుక్ లో కనిపిస్తున్న నేచురల్ స్టార్
ఇక ‘దసరా’ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు నేపథ్యంతో ఈ సినిమా రాబోతున్నది. ఈ సినిమాలో నాని గతంలో ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే నాని రఫ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో సముద్రఖని, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీరా జాస్మిన్, పూర్ణ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
View this post on Instagram
View this post on Instagram
Read Also: బొమ్మల పుస్తకంగా ‘RRR’ సినిమా, కొడుకుపై ప్రేమతో ఆ తండ్రి ఏం చేశాడో చూడండి