అన్వేషించండి

Keedaa Cola: ఆ డ్రింక్‌కు, వాళ్ల గొడవకు ఏమిటీ లింక్? ఇంట్రస్టింగ్‌గా ‘కీడా కోలా’ టీజర్!

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈసారి మరో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘కీడా కోలా’ అనే ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Keedaa Cola: టాలీవుడ్ లో ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈసారి మరో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘కీడా కోలా’ అనే ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ దర్వకత్వం చేయబోతున్నారాయన. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ టీజర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘కీడా కోలా’

తరుణ్ భాస్కర్ సినిమాలు అన్నీ చాలా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటాయి. ఈ ‘కీడా కోలా’ కూడా అలాగే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ విషయానికొస్తే.. ఒక డిఫరెంట్ కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్ లో ప్రారంభంలో కీడా కోలా అనే లిక్విడ్ బాటిల్ ను చూపించారు. అందులో ఓ బొద్దింక ఇరుక్కుపోయినట్లు చూపించారు. తర్వాత బ్రహ్మనందం, చైతన్య మధ్య జరిగే సంభాషణలను చూపించారు. ‘అరేయ్ ఏంట్రా ఇది’ అని బ్రహ్మానందం అడుగుతుంటే ‘గ్రెేప్స్ ఏమో’ అని చైతన్య అమాయకంగా సమాధానం చెప్పడం దానికి బ్రహ్మనందం చైతన్యపై ఓ డైలాగ్ వేయడం, బ్రహ్మానందం డైలాగ్ కు చైతన్య కౌంటర్ ఇవ్వడం వంటివి చూపించారు.

ఈ సినిమా స్టోరీ మొత్తం కీడా కోలా చుట్టూనే తిరుగుతుంది అని తెలుస్తోంది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్ లు చూపించారు. ఇంతకీ ఆ కోలాలో బొద్దింక ఎలా ఇరుక్కుంది, దానికోసం ఎందుకు అందరూ పోటీపడుతున్నారు. వంటి అంశాలను థియేటర్లలో చూడాల్సిందే. ఈ మూవీలో తరుణ్ కూడా నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. టీజర్ చివర్లో “శ్వాస మీద ధ్వాసతో.. ఒస్తున్నాం” అంటూ ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.

ఇక మూవీలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా ఉంది. టీజర్ లో తరుణ్ భాస్కర్ మార్క్ కనిపిస్తోంది. మూవీలో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేశారు. తరుణ్ భాస్కర్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది.  ఈ టీజర్ ను దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దానితో పాటు “కష్టపడ్డాం. పాలమ్మినం. ఇక అంతా మీదే. తీసుకోండి. ఫైర్ లేపాలి” అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రానికి కూడా వివేక్ సాగర్‌ నే మ్యూజిక్ డైరెక్టర్‌ గా తీసుకున్నారు తరుణ్. విజి సైన్మా ప్రొడక్షన్ సినిమాను నిర్మించారు. ఈ ఏడాదే మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 

‘ఈ నగరానికి ఏమైంది’ రీ రిలీజ్..

ఐదేళ్ల కిందట తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాను జూన్ 29న రీ రిలీజ్ చేయనున్నారు. మూవీ వచ్చి ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ రీరిలీజ్ కు ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా హిట్ అందుకోకపోయినా చాలా మందికి ఫేవరేట్ సినిమాగా నిలిచింది. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూడటానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా భారీ ఎత్తులోనే జరుగుతున్నాయి.

Also Read: ‘బ్రో’ టీజర్ అప్‌డేట్: డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ - వైరల్ అవుతున్న ఫోటోలు!

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Karthika Deepam 2 Serial Today July 11th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని అంతా తెలిసే చేస్తుందా! సూరజ్ జ్యోత్స్న మేనమామ కొడుకా!
Nindu Manasulu Serial Today July 11th: నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!
నిండు మనసులు: ఇందిరను గణ చంపించేశాడా! ప్రేరణ, సిద్ధూల పెళ్లి అవుతుందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget