News
News
X

Karthika Deepam December 18 Episode: మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య, రుద్రాణితో డాక్టర్ బాబు ఛాలెంజ్, అర్థరాత్రి పిల్లల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్ ను చూసి కంగారు పడిన దీప, కార్తీకదీపం డిసెంబరు 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్ 18 శనివారం 1226 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే..

FOLLOW US: 

కార్తీకదీపం సీరియల్ డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్

మోనిత బాబుని ఎత్తుకెళ్లిభార్య చేతిలో పెట్టిన కోటేష్.. భార్య బిడ్డతో సహా ఇంటికి చేరుతారు. వారికి హారితిచ్చి లోపలకు ఆహ్వానించి దీప.. ఆ బాబుని ఎత్తుకుంటుంది. ఈ బాబు రోజుల బిడ్డలా లేడని కార్తీ అంటే నాకూ అదే అనిపిస్తోందన్న దీప..కోటేష్ ని ప్రశ్నిస్తుంది. దీప- కార్తీక్‌ల ప్రశ్నలకు కోటేష్ మొదట భయపడినా... మా శ్రీవల్లికి కాన్పులు పోతూ ఉన్నాయి ఈ సారి కూడా కాన్పు పోయింది. మా అదృష్టం కొద్దీ ఓ అనాథ బాబు దొరికితే ఫార్మాలటీస్ అన్నీ పూర్తిచేసుకుని తెచ్చుకున్నాం, ఇక్కడ ఎవ్వరితోనూ చెప్పొద్దని అంటాడు.  దాంతో దీప, కార్తీక్‌లు సరేనంటారు. దీప-శ్రీవల్లి మధ్య డిస్కషన్ అంతా విన్న అబ్బులు వెంటనే వెళ్లి రుద్రాణికి చెబుతాడు.

Also Read:  నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
దీప, శ్రీవల్లి బాబుతో కూర్చుని ఉంటే.. ఇటు కార్తీక్, అటు కోటేష్‌ నిలబడి ఉంటారు. హిమ, సౌర్యలు బాబుతో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీవల్లి.. ఏం సంబంధం లేకపోయినా మాకు సాయం చేస్తున్నారు...అక్కా మిమ్మల్ని చూస్తుంటే బాగా కలిగిన ఫ్యామిలీలా ఉన్నారు.. అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతుంది శ్రీవల్లి. ఇంతలో స్పందించిన కోటేష్..శ్రీవల్లి అలా అడుగుతారా నీకు బుద్ధుందా అని తిడతాడు. మనసులో పెట్టుకోకుండా అడగడంలో తప్పులేదుకదా అంటుంది దీప. పిల్లలిద్దర్నీ అక్కడి నుంచి పంపించేసిన దీప... మాది విజయనగరం, కలిగిన కుటుంబం లేని కుటుంబం అనేం లేదు.  డబ్బుతో కాకుండా మనసుతో మనుషుల్ని కొలుస్తాను. పరిస్థితులు బాగాలేక ఇలా వచ్చాం.. ఇంతకు మించి ఏమీ చెప్పేలను అంటుంది దీప. అడిగానని ఏమీ అనుకోకు అక్కా అంటుంది. మాకు సాయం చేసినందుకు రుద్రాణి మిమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అని భయపడతారు కోటేష్... అయినా ఇల్లు మీది ఎందుకు భయపడాలి అంటే అప్పుతీసుకున్నాం కదా అంటాడు కోటేష్. అవును ఏదో ఒకటి ఆలోచిద్దాం మీరేం భయపడకండి అంటాడు కార్తీక్. 

Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఇక మోనిత గోడకు తగిలించిన ఫొటో ముందు సెల్ఫీలు దిగుతుంటే.. ఏం చేస్తున్నారని అడుగుతుంది ప్రియమణి. చూశావా ప్రియమణి ఇక్కడ కార్తీక్ ఇంట్లో ఇలా నేను ఈ ఫొటో ఉంటాయని నువ్వు ఊహించావా..నేను ఇంట్లో కాలు పెట్టి, ఈ ఫొటో ఇక్కడపెట్టి, ఈ ఇంటి కోడలిగా అందరి నోర్లూ మూయిస్తానని నువ్వు ఎప్పుడైనా కలగన్నావా , నువ్వు ఊహించలేదుకదా ఇవన్నీ జరుగుతాయని అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్య ఫొటో తీసి విసిరికొడుతుంది.  ‘నేను ఇలా కొడతానని ఊహించావా ప్రియమణీ’ అంటూ అరుస్తుంది. లేదమ్మా అంటూ తలాడిస్తుంది ప్రియమణి. ‘ఏంటి మోనితా నువ్వు ఊహించావా’ అంటుంది సౌందర్య అంతే కోపంగా.. మోనిత మౌనంగానే తల వంచుకుని ఉండిపోతుంది. ‘బిడ్డ పోయాడని వచ్చావ్.. నువ్వు నిజం చెబుతున్నావో తెలియాలంటే నా కళ్లముందే ఉండాలని నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను. అంతేకానీ నీ తాటాకు చప్పుళ్లకు భయపడి కాదు. నువ్వు ఇలాగే కలలు కంటూ ఉండు. నిన్ను, నీ అసిస్టెంట్ ప్రియమణిని గేట్ బయట గంటేస్తాను. ఏం ఏంటలా మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నావ్...అదంతా క్లీన్ చేయి అని ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది సౌందర్య .  ఏం చెయ్యలేక మోనిత అలానే నిలబడి ఉండిపోతుంది.

Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
అబ్బులు కోటేష్ ఇంటి తలుపులు కొడతాడు. కార్తీక్ తలుపు తీస్తాడు. వెనుకే దీప, శ్రీవల్లి కోటేష్ ఉంటారు. అబ్బుల్ని చూసి షాక్ అవుతారు. అక్క నిన్ను రమ్మందిఅంటాడు అబ్బులు కార్తీక్‌ని. రాకపోతే అని కార్తీక్ అనగానే.. అక్కే ఇక్కడికి వస్తుంది అంటాడు అబ్బులు. ఆమె వస్తే దీప అనవసరంగా గొడవ పడుతుంది. దీప బాధపడుతుంది.. నేను వెళ్లడమే కరెక్ట్ అనుకుని పదా వస్తాను అంటాడు కార్తీక్. ఈ సమయంలో మీరు వెళ్లడం అవసరమా అంటే భయపడకు దీపా అంటాడు. సార్ ఒక్కరే వెళుతున్నారు అని కోటేష్ అంటే పర్వాలేదంటాడు. డాక్టర్ బాబు జాగ్రత్త అని చెప్పి పంపిస్తుంది దీప. 

Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
ఇంట్లో ఫొటో తీసేస్సే ఇంటి ముందు పది ఫ్లెక్సీలు  పెట్టిస్తా అన్న మోనిత మాటలు గుర్తుచేసుకుంటాడు ఆదిత్య. పాలు ఇదిగో అన్న శ్రావ్యతో అందరం విషం తాగాల్సిన పరిస్థితి వచ్చిందంటాడు. తన గొంతు పట్టి గుమ్మం బయటకు గెంటేయాలన్నంత కోపం వస్తోందన్న ఆదిత్యతో...వస్తుంది కానీ ఏమీ చేయలేరు కదా అంటుంది శ్రావ్య. ఆమోనితని ఏమీ చేయలేకపోతున్నాం అని ఆదిత్య బాధపడతాడు. మీరు మీ ఇంట్లో వాళ్లు ఏమీ చేయలేరు..రేపు దీపక్క ఇంటికి వస్తే నేను మొహం ఎలా చూపించుకోవాలి. దీపక్క ఇంట్లో అందరూ మోనితని ఏమీ అనలేదు నేను కూడా సర్దుకుపోతున్నా అని చెప్పాలా అని అడుగుతుంది శ్రావ్య. నా స్థానం మోనితకి ఇచ్చారా అని దీపక్క అంటే ఏం చెప్పాలని అడుగుతుంది. ఏదో ఒకటి చేసి తనని కచ్చితంగా పంపించేద్దాం అంటాడు ఆదిత్య. 

Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
ఓవైపు పిల్లలు బాబుతో ఆడుకుంటుంటారు. దీప ఆలోచనలో పడుతుంది. రుద్రాణి కార్తీక్ బాబుని ఈ టైమ్ లో ఎందుకు పిలిచినట్టు..కార్తీక్ బాబుకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారా, ఆయన్ని ఒంటరిగా పంపించాల్సింది కాదేమో అని ఆలోచిస్తుంది. భగవంతుడా కార్తీక్ బాబుకి ఏమీ కాకుండా చూడు అనుకుంటుంది.  రుద్రాణి  ఎదురుగా నిలబడిన కార్తీక్ తో... ఈ రుద్రాణి అంటే అటు పది ఊర్లు, ఇటు పది ఊర్లు చెప్పుకుంటాయిలే. ఒక్కరంటే ఒక్కరు కూడా నేను మంచిదాన్ని అని చెప్పుకోరు. నేను అందరూ అనుకున్న దానికంటే చెడ్డదాన్ని, నచ్చితే నెత్తిపై పెట్టుకుంటా, లేదంటే నేలకేసి కొడతా అంటుంది.

Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్

ఆ దస్తావేజులపై సంతకం పెట్టు అంటుంది.  ఏం చేశారో, ఎక్కడినుంచి వచ్చారో, ఏం చేసి వచ్చారో తెలియదు. మంచి పనులు చేస్తుంటే కొందరికి బలం వస్తుంది కానీ చెడ్డపనులు చేస్తే నాకు బలం వస్తుంది. సరే వాళ్లని కొట్టావ్ సామాన్లు ఇంట్లో పెట్టావ్...కానీ నీ పెళ్లాం దీప ఆ శ్రీవల్లి కోటేష్ ను ఏకంగా ఇంట్లోనే పెట్టింది. ఇన్నిన్ని మంచి పనులు చేసి మీరు పుణ్యం సంపాదిస్తే ఎలా చెప్పు... ఆకోటేష్ డబ్బు తీసుకున్నాడు, అడిగినప్పుడు ఇస్తూనే ఉన్నా..అసలు రాలేదు, వడ్డీ రాలేదు అందుకే కోపం వచ్చింది, ఇల్లు నా స్వాధీనం లోకి వచ్చింది.  నువ్వు గొప్పోడివే కావచ్చు, గొప్ప కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు. నీ గొప్ప నీది-నా అప్పు నాది. నిన్ను సారు అనాలో బాబు అనాలో నాకు తెలియట్లేదు కానీ... రుద్రాణి రూల్ ప్రకారం అప్పు నువ్వు తీర్చు, ఈ దస్తావేజులపై సంతకం పెట్టు. కోటేష్ నాకు 2 లక్షలు ఇవ్వాలి. వాటిని ధర్మవడ్డీలు కలిపి లక్షా ఇరవై వేలు.. మొత్తం కలిసి 3 లక్షల ఇరవై వేలు నెలరోజుల్లో నువ్వు ఇస్తానని సంతకం పెడతావా సరే.. లేదంటే ఆ శ్రీవల్లి వాళ్లని రోడ్డుకి ఈడుస్తాను అంటుంది. ఆ అప్పు నేను తీరుస్తా అంటాడు కార్తీక్. నెలరోజుల్లో అంత మొత్తం తీర్చడం అంటే భయం వేస్తోందా..నాకేం సంబంధం లేదు ఆ శ్రీవల్లి కోటేష్ లు మీ ఇష్టం అనేసి వెళ్లిపో నీకు ఏ బాధా ఉండదని చెబుతుంది. కానీ కార్తీక్ అప్పు తీరుస్తా అని సంతకం చేస్తాడు.  ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 

కమింగప్
అక్కా సంతకం పెట్టాడు సరే మరి డబ్బులు ఇవ్వకపోతే అంటే నాకు డబ్బులు చెల్లించకపోతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా అందులోంచి నేను ఒకర్ని తెచ్చుకుంటానని అగ్రిమెంట్ లో రాయించాను కదా అంటుంది రుద్రాణి. నిద్రపోతున్న పిల్లలు ఇద్దర్నీ చూసి కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలో దీప లేచి కూర్చుంటుంది. 

Also Read:  గౌతమ్ కి కాల్ చేసిన వసుధార.. షాక్ లో రిషి.. ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర..గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read:  రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Dec 2021 10:05 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 18 th December Episode Karthika Deepam December 18 Episode

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham August 18th Update: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

Ennenno Janmalabandham August 18th Update: యష్ ఇంట ఖైలాష్ తుఫాన్ - భర్త ఇచ్చిన చీర కట్టుకుని మురిసిన వేద, యష్ కంటతడి

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ -  ఇందులో నిజమెంతా?

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

టాప్ స్టోరీస్

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!