అన్వేషించండి

Karthika Deepam ఫిబ్రవరి 19 ఎపిసోడ్: మోనిత విషయంలో కార్తీక్ ని హెచ్చరిస్తూ పులి-బంగారు కడియం కథ గుర్తుచేసిన సౌందర్య, కార్తీకదీపం శనివారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 19 శనివారం 1280 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం ఫిబ్రవరి 19 శనివారం ఎపిసోడ్
ఎప్పుడూలేనంతగా మోనిత ఎందుకు సాయం చేస్తోంది, దాని వెనుక ఎలాంటి కుట్ర ఉందో ఏమో అని సౌందర్య భయం వ్యక్తం చేస్తుంది. ఇంతలో మోనిత కాల్ చేసి మా బాబాయ్ కి ఆపరేషన్ చేస్తావా అంటే స్పీకర్ ఆన్ చేసిన కార్తీక్ చేస్తానని చెప్పాను కదా, నువ్వు ఇచ్చిన మాటమీద నిలబడతావా అని అడుగుతాడు. తప్పకుండా అని మోనిత అనగానే కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పిల్లలు డాడీ...అమ్మ మా స్కూల్ టీసీల కోసం తాడికొండ వెళ్లింది రేపు వస్తుంది అనగానే... రేపు కాకపోతే ఎల్లుండు రమ్మను అనేసి కోపంగా వెళ్లిపోతాడు. పిల్లలు, సౌందర్య షాక్ అవుతారు. కాళ్లకు గోర్లు తీయడం కూడా తప్పేం కాదంటుంది మోనిత. మీ కూతురే ఉంటే చేయదా చెప్పండి..మిమ్మల్ని కాపాడుకోవడమే నా ప్రధమ కర్తవ్యం అంటుంది. మోనిత నిజంగా మారిందనుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు మోనిత బాబాయ్. అది చూసిన మోనిత..నా ప్లాన్ వింటే ఇప్పుడే నీ గుండె ఆగిపోతుంది, కానీ ఏం చేస్తాం ఏం జరుగుతుందో చూస్తుండు అనుకుంటుంది. 

మోనిత తనంతట తానుగా ఒప్పుకుంది, వాళ్ల బాబాయ్ కి ఆపరేషన్ చేస్తే అన్నీ వదిలేస్తుందనే ఒప్పుకున్నా అని సౌందర్యతో అంటాడు కార్తీక్. ఓ డాక్టర్ గా నేను చేయాల్సిందే అడిగింది కదా దీప ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అన్న కార్తీక్ తో ...చిన్నప్పుడు పులి-బంగారు కడియం చదువుకోలేదా అని గుర్తుచేసిన సౌందర్య... కడియం ఆశ చూపించి పులి పిలిచినట్టే ఉందని గుర్తుచేస్తుంది. దీప సరిగ్గానే ఆలోచిస్తుంది కానీ నువ్వే అనే లోగా... అన్నీ నెగిటివ్ గా ఆలోచించడం ఎందుకు అంటాడు కార్తీక్. ఎందుకంటే పులి ఎప్పటికీ పులే కాబట్టి అని రిప్లై ఇస్తుంది సౌందర్య. దోష నివారణ పూజ దీపకి  చెప్పకుండా చేయించాం, నేను కూడా నీకు సపోర్ట్ చేశాను...కానీ ఆ విషయాన్ని ఫొటో తీయించి రచ్చ చేసింది. చివరకి అదంతా కుట్ర అని దీప బయటపెట్టింది. మంచితనం మన ఫ్యామిలీకి చాలా చెడుచేసిన విషయం మరిచిపోద్దని మరోసారి హెచ్చరిస్తుంది.

Also Read: మళ్లీ మోనిత కుట్రలో ఇరుక్కున్న కార్తీక్ ని దీప కాపాడుకోగలదా, కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
బుక్స్ సర్దుకుంటున్నపిల్లలిద్దరూ...తాడికొండలో అన్నీ కష్టాలే మళ్లీ హైదరాబాద్ వస్తామని అస్సలు అనుకోలేదు అనుకుంటారు. మనం ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లొద్దు ఇంకెప్పుడూ తాడికొండ గురించి మాట్లాడొద్దు అనుకుంటారు. అక్కడకు  వెళ్లాకే తమ్ముడు దొరికాడు, వాడు పెద్దయ్యాక తాడికొండ తీసుకెళ్లి కోటేష్ అంకుల్, శ్రీవల్లి ఆంటీ గురించి చెబుదాం అని శౌర్య అంటుంది. హిమ కోపంగా లేచి నిలబడి ఆనంద్ మన తమ్ముడు..మన అమ్మా నాన్నలే మన తమ్ముడి అమ్మానాన్నలు....వాళ్లు వేరు మనం వేరు అని తమ్ముడికి ఎప్పటికీ తెలియకూడదు, తాడికొండ గురించి శ్రీవల్లి-కోటేశ్ అంకుల్ గురించి తనకి ఎప్పటికీ తెలియకూడదు, మనం వాడి సొంత అక్కలం అర్థమైందా అంటుంది. హిమా ఎందుకింత కోపం అని శౌర్య అంటే...కోపం కాదు బాధ అన్న శౌర్య... పెద్దయ్యాక నిజం తెలిస్తే చాలా బాధపడతాడు కదా అంటుంది. నేను ఇంతదూరం ఆలోచించలేదు అని హిమని కూల్ చేస్తుంది. వాడు మన తమ్ముడు కాదని ఆనంద్ కి ఎప్పుడూ తెలియనివ్వనని నాకు ప్రామిస్ చేయి అంటుంది హిమ. మొత్తం విన్న సౌందర్య...ఆనంద్ కి పిల్లలు బాగా దగ్గరైపోతున్నారు, ఈ సమస్యకి ఓ పరిష్కారం ఆలోచించాలి అనుకుంటూ వెళ్లిపోతుంది. 

హాస్పిటల్లో నర్స్ తో మాట్లాడిన మోనిత నేను చెప్పింది చేయి అంటే...నర్సు మాత్రం రివర్సవుతుంది. మీ బాబాయ్ కి ఆపరేషన్ చేయిస్తే చేయించండి లేదంటే లేదు నేను మాత్రం చేయను అనేసి వెళ్లిపోతుంది. మళ్లీ వెనక్కు పిలిచిన మోనిత నీకు ఆఫర్ ఇచ్చాను వద్దన్నావ్ సరే ఇంతటితో ఈ టాపిక్ వదిలేద్దాం, నేను అడిగినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా కార్తీక్ కి అస్సలు చెప్పొద్దు అంటుంది. ఇంతలో పక్కరూమ్ లోంచి బయటకు వచ్చిన కార్తీక్ ...మోనిత అని పిలుస్తాడు. తనతో ఏం మాట్లాడుతున్నావ్ అంటే పేషెంట్ కండిషన్ గురించి చెబితే నేను మందులు మార్చమని చెప్పానంతే అంటుంది. నీతో మాట్లాడాలి నా క్యాబిన్ కి రా అనేసి వెళ్లిపోతాడు.

Also Read: మనసులోనే రిషి-వసు నిశ్శబ్ద ప్రేమ యుద్ధం, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
కొంపతీసి మొత్తం వినేశాడా అనుకుంటుంది మోనిత. దోష నివారణ పూజని తనకు అనుకూలంగా మార్చుకుంది అన్న సౌందర్య మాటలు గుర్తుచేసుకున్న కార్తీక్...నేను ఓ మాట అడుగుతాను నిజం చెబుతావా అంటాడు. నిజమే చెబుతాను అడుగు అంటుంది మోనిత.  మోనిత..నేను మీ బాబాయ్ కి ఆపరేషన్ చేస్తే హాస్పిటల్ తీసేస్తాను, నన్ను ఇబ్బంది పెట్టను అన్నావ్...ఇందులో ఎలాంటి కుట్రలు లేవుకదా అని అంటాడు. వెంటనే కాళ్లపై పడిపోయిన మోనిత నువ్వు ఛీ కొట్టినా పొమ్మన్నా నీపై ప్రేమ తగ్గలేదు, నీకు బాబుని కనిచ్చాను,నువ్వు దీపా దీపా అని కలవరిస్తున్నా సమాజం అంతా నన్ను ఛీ కొడుతున్నా నీపై ఇసుమంత ప్రేమైనా తగ్గించుకోలేదు, ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికీ రాకూడదు అని దొంగ ఏడుపు మొదలుపెడుతుంది. నా ప్రేమ నీకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటుంది. వెంటనే కరిగిపోయిన కార్తీక్ Sorry చెబుతాడు...నేను ఊరికే అడిగాను, నువ్వు ఏడవకు పైకి లే అంటాడు. కార్తీక్ నా కన్నీళ్లకు పడిపోయినట్టున్నాడు అని మనసులో అనుకుంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టను, ఏమీ కోరను, నీ పర్సనల్ లైఫ్ నీకు వదిలేస్తాను, నేను మాటపై నిల్చుంటాను కానీ నువ్వు నన్ను అనుమానించావ్, నా ప్రేమను అవమానించావ్, బాబాయ్ ని బతికించు చాలు ఇంకేం వద్దు అని దొంగఏడుపు కంటిన్యూ చేస్తూ వెళ్లుపోతూ బయట అడుగుపెట్టగానే నవ్వుకుంటుంది. అటు కార్తీక్ మాత్రం ఇలా అడిగి బాధపెట్టానా, బాగా హర్ట్ అయినట్టుంది అనుకుంటాడు.

బస్తీకి వెళ్లిన సౌందర్య..ఇక్కడివారి మనసులు మార్చే ప్రయత్నంలో పడిందా మోనిత అని అడుగుతుంది సౌందర్య. అవును మేడం అవసరానికి డబ్బులు ఇచ్చి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని చెబుతాడు వారణాసి. కొందరు మోనిత మాయలో పడుతున్నారంటూ లక్ష్మణ్ ని చూసి అంటాడు వారణాసి. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత బాబాయ్ నమస్కారం పెడతాడు. మా అబ్బాయి డాక్టర్ గొప్పవాడు అంటూ సౌందర్య. తెలుసు మేడం అమెరికాలో వైద్యులు సైతం కార్తీక్ పేరే చెప్పాడంటాడు మోనిత బాబాయ్. ఇచ్చిన మాట ప్రకారం మీకు మా అబ్బాయి ఆపరేషన్ చేస్తాడు అయితే ఆపరేషన్ అయిపోయిన వెంటనే మీరు మోనితని తీసుకుని అమెరికా వెళ్లిపోండి అని చెబుతుంది సౌందర్య. వెనుకే మోనిత ఇంట్రీ ఇస్తుంది. ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Mohammed Siraj - Travis Head: ట్రావిస్ హెడ్- సిరాజ్ వివాదం, మరో
ట్రావిస్ హెడ్- సిరాజ్ వివాదం, మరో "మంకీ గేట్" అవుతుందా..?
Farmers Resume Delhi Chalo March: రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - తరలివస్తున్న అన్నదాతలు
రైతుల ఛలో ఢిల్లీ ఆందోళన, శంభు సరిహద్ద వద్ద భద్రత కట్టుదిట్టం - భారీగా తరలివస్తున్న అన్నదాతలు
Tecno Phantom V Fold 2 5G: రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
రూ.80 వేలలోనే ఫోల్డబుల్ ఫోన్ - టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ వచ్చేసింది!
Crime News: తెలంగాణలో మరో అమానుషం, ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు!
తెలంగాణలో మరో అమానుషం, ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు!
Embed widget