అన్వేషించండి

Kareena Kapoor: యశ్ సినిమాలో కరీనా కపూర్ - ఇన్నాళ్లకు సౌత్ డెబ్యూకు సిద్ధమయిన బాలీవుడ్ భామ

Toxic Movie: ‘కేజీఎఫ్’లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యశ్ చేస్తున్న చిత్రమే ‘టాక్సిక్’. ఇక ఈ మూవీతో సౌత్‌లో అడుగుపెట్టడానికి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సిద్ధమవుతోందని టాక్ మొదలయ్యింది.

Kareena Kapoor in Toxic: ఒకప్పుడు సౌత్ సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్స్ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ను బీట్ చేసే రేంజ్‌లో సినిమాలను తెరకెక్కిస్తోంది సౌత్ ఇండస్ట్రీ. అందుకే బాలీవుడ్ భామలు సైతం ఇక్కడి నుండి ఆఫర్ రాగానే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. అలా ఎంతోమంది హిందీ హీరోయిన్లు త్వరలోనే సౌత్ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇక ఆ లిస్ట్‌లో కరీనా కపూర్ కూడా యాడ్ అవ్వనుందని సమాచారం. హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కరీనా.. త్వరలో శాండిల్‌వుడ్‌లో అడుగుపెట్టనుందని సమాచారం.

సౌత్‌లో తొలి అడుగు..
2023లో కరీనా కపూర్ మంచి సక్సెస్‌ను చూసింది. ‘జానే జాన్’, ‘ది బకింఘమ్ మర్డర్స్’ లాంటి రెండు థ్రిల్లర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్. ఇప్పటికీ తనకు హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ లభిస్తున్నా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని కరీనా నిర్ణయించకుందట. అందుకే రాకీ భాయ్ అలియాస్ యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’లో ఒక కీలక పాత్ర చేయడానికి ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది కరీనా కపూర్ కెరీర్‌లో మొదటి కన్నడ చిత్రం మాత్రమే కాదు.. తను నటించబోతున్న మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా. ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కరీనా.. ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా భాగమవ్వలేదు. మొదటిసారి ‘టాక్సిక్’తో తనకు ఆ అవకాశం లభించింది.

ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు..
‘కేజీఎఫ్’తో కన్నడ ఇండస్ట్రీని ఒక రేంజ్‌లో నిలబెట్టడమే కాకుండా తన కెరీర్‌లో కూడా సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు యశ్. ఇక ఆ మూవీ తర్వాత యశ్ ఏ సినిమా చేయబోతున్నాడు అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అదే సమయంలో తన తరువాతి సినిమా ‘టాక్సిక్’ అంటూ ఒక టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గోవాలోని డ్రగ్ మాఫియా ఆపరేషన్స్‌కు సంబంధించిందని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ‘టాక్సిక్’కు ‘పెద్దవారికి ఫెయిరీటెయిల్’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది మూవీ టీమ్. ఇప్పటికే ఈ మూవీలో యశ్‌కు జోడీగా సాయి పల్లవి, శృతి హాసన్ నటిస్తారని వార్తలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు కరీనా కపూర్ పేరు కూడా వినిపించడంతో ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ అయ్యింది.

అప్పుడు రవీనా.. ఇప్పుడు కరీనా..
యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో కూడా రవీనా టండన్‌లాంటి సీనియర్ బాలీవుడ్ హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ మూవీ రవీనాకు కూడా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి కరీనా కపూర్‌లాంటి హీరోయిన్‌తో నటించడానికి సిద్ధమవుతుండడంతో.. యశ్‌కు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లక్కీ ఛార్మ్‌లా  మారిపోయారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కరీనా చేతిలో ‘ది క్రూ’, ‘సింగం 3’ వంటి రెండు సినిమాలు ఉన్నాయి. మరి తన బిజీ షెడ్యూల్ నుండి టైమ్ తీసుకొని కరీనా కపూర్.. తన సౌత్ డెబ్యూకు ఓకే చెప్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: ఒకప్పుడు ఆ హీరోను ‘బొద్దింక’ అని తిట్టిన కంగనా - ఇప్పుడు అతడి నటన చూస్తూ ఏడ్చేశానంటూ పోస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Embed widget