అన్వేషించండి

Kareena Kapoor: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ - ఆమె నటించే ఫస్ట్ మూవీ ఇదేనా?

బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్..త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించడం విశేషం.

Kareena Kapoor: కరీనా కపూర్ గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. యాక్షన్, కామెడీ, లవ్.. ఒకటేమిటి అన్ని జానర్లలో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘రిఫ్యూజ్’ చిత్రంలో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, దశబ్దానికిపైగా హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ‘ది క్రూ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాజేష్ కృష్ణన్‌ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టబు, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ లుగా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రయాణీకులు వస్తువులు, బంగారం ఎలా కొట్టేస్తారు? అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కరీనా ఎంట్రీ

ఇక ‘ది క్రూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కరీనా కపూర్, పలు కీలక విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించబోతున్నాను. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి సౌత్ సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా తెలియదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నేను భావిస్తున్నాను” అని వెల్లడించింది.   

కరీనా నటించబోయేది యశ్ మూవీలోనేనా?

కరీనా కపూర్ కామెంట్స్ నేపథ్యంలో నెటిజన్లు ఆమె నటించబోయే సినిమా ఇదే అంటూ చర్చలు నడుపుతున్నారు. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యశ్ ‘టాక్సిక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. ‘KGF’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ తర్వాత యశ్ ‘టాక్సిక్​’ అనే సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ లో ఈ చిత్రం 19వ మూవీగా తెరకెక్కుతోంది. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ చేసిన కామెంట్స్ ను నెటిజన్లు ఈ చిత్రంతో లింక్ చేస్తున్నారు. కచ్చితంగా ఆమె నటించబోయేది యశ్ ‘టాక్సిక్’లోనే అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ, ఈ సినిమాలో కరీనా ఎంపిక అయినట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలోనే కరీనా నటించే సినిమా ఏది అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ జోష్- తెలుగులో సరికొత్త రికార్డు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget