Karan Johar: నేను ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేయాలనుకున్నా - కరణ్ జోహార్ షాకింగ్ వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో అప్పట్లో రూ.150 కోట్ల వసూళ్లు సాధించిన ఆ సినిమాలో అనుష్కను వద్దని డైరెక్టర్ ఆదిత్య చోప్రాకు చెప్పానంటూ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Karan Johar : బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నిర్మాత, వ్యాఖ్యాత కరణ్ జోహార్ తరచూ పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నటి కంగనా రనౌత్‌కి ఏమాత్రం మించకుండా ట్రెండింగ్ ఉంటున్నారు. అదే తరహాలో ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ నటి అనుష్క శర్మ కెరీర్‌ను తాను దాదాపు నాశనం చేశానని ఒప్పుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్‌లో స్టార్-కిడ్ లాంచర్‌గా పేరుగాంచిన కరణ్.. 'రబ్ నే బనా ది జోడీ' చిత్రంలో అనుష్కను తీసుకోవద్దని డైరెక్టర్ ఆదిత్య చోప్రాకు చెప్పారు. ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇక రబ్ నే బనా ది జోడీ .. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందించబడిన ఒక హిందీ హాస్య ప్రేమ కథా చిత్రం. ‘‘There is an extraordinary love story in every ordinary jodi’’.. అంటే ప్రతి సాధారణ జంటలోనూ ఒక అసాధారణ ప్రేమ కథ ఉంటుంది అనే ఉప శీర్షికతో ఆదిత్య తన టాలెంట్ ను సినిమా ద్వారా చూపించారు. ఈ మూవీలో అనుష్క తన భర్త 'సురీందర్ సూరి సాహ్ని'తో ప్రేమలో పడే వివాహితగా నటించారు. తన భర్త క్యారెక్టర్ లో షారుఖ్ ఖాన్ అదరగొట్టారు. భర్తగా అనుష్క శర్మ దగ్గర నటిస్తూనే.. రాజ్ కపూర్ గా తనని తాను పరిచయం చేసుకుని, మోడ్రన్ లుక్ లో అనుష్కను ఆకర్షించి, మారువేషంలో ఆమెను ఆకట్టుకుంటాడు. ఆ తర్వాత అలా చేసింది తన భర్తేనని, తన ప్రేమ కోసమే అదంతా చేశాడని తెలుసుకున్న అనుష్క.. భర్త సురీందర్ ను భర్తగా అంగీకరిస్తుంది. 2008 డిసెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీని అప్పట్లోనే రూ.16కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా విడుదల అనంతరం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150కోట్లు వసూళ్లు చేసి, రికార్డు సృష్టించింది. దీంతో అటు అనుష్కకు, షారుఖ్ కు ఈ మూవీ తమ కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా ప్రారంభంలో డైరెక్టర్ ఆదిత్య చోప్రాకు కరణ్ జోహార్ ఓ సలహా ఇచ్చారు. 'రబ్ నే బనా ది జోడీ'లో షారుఖ్ సరసన అనుష్క శర్మను కాకుండా సోనమ్ కపూర్ ను పెట్టాలని కరణ్ సూచించారు. కానీ ఆదిత్య చోప్రా మాత్రం అనుష్కశర్మనే హీరోయిన్ గా పెట్టి సినిమా తీసి, హిట్ కొట్టారు. ఈ సినిమాను కరణ్ అయిష్టంగానే చూసినా.. వచ్చే విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్ సరసన బ్యాండ్ బాజా బారాత్‌లో అనుష్క నటనకు ముగ్ధుడై ఆమెకు క్షమాపణలు చెప్పాలనుకున్నానని కరణ్ జోహారే చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్‌లో అనుష్క శర్మ ఓ ప్రధాన పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత 2016లో జరిగిన 18వ మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను అనుష్కను ఆమె రూపాన్ని బట్టి ఎలా అంచనా వేశాడో చెప్పడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. కరణ్ జోహార్ స్టేజ్ ఇంటరాక్షన్ సందర్భంగా రాజీవ్ మసంద్, అనుపమ చోప్రాలతో మాట్లాడుతూ "అనుష్క శర్మ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేయాలనుకున్నాను" అని చెప్పారు.
ఎందుకంటే డైరెక్టర్ ఆదిత్య చోప్రా అనుష్క శర్మను ‘రబ్ నే బనా ది జోడి’ సినిమాలో హీరోయిన్ గా అనుకుంటున్నానని చెప్పినప్పుడు తాను ‘‘ఆమెను తీసుకోవద్దు, పిచ్చిగా ఉన్నావు. మీరు ఆమెను హీరోయిన్ గా పెట్టాలనుకుంటున్నారా? మీరు అనుష్క శర్మను కథానాయికగా ఓకే చేయొద్దు’’ అంటూ సలహా ఇచ్చానని కరణ్ జోహార్ వెల్లడించారు. ఆ సమయంలో మరొకరిని ప్రతిపాదించానని తెలిపారు. అలా అనుష్క శర్మ కెరీర్ ను తాను పూర్తిగా నాశనం చేయాలనుకున్నానని, ఇది పూర్తిగా తెర వెనుక జరిగిన విషయం అని చెప్పారు. ఆ సినిమాను కూడా తాను అయిష్టంగానే చూశానని కరణ్ జోహార్ వివరించారు.
Also Read : జై భజరంగ్ బలి - ప్రభాస్ 'ఆదిపురుష్'లో హనుమంతుడిని చూశారా?